
ఎన్నో ఆశలు, కలలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అమ్మాయిల్ని అవకాశాల పేరుతో కొందరు ట్రాప్ చేసి వారిపై అత్యాచారాలు చేయడం, లైంగిక కోరికలు తీర్చుకోవడం వంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగడుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాలను, సంఘటనలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పైకి పెద్ద మనుషుల్లా నటించేవారి బాగోతాలు దాంతో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలతో తల్లిదండ్రులు.. తమ బిడ్డలను నటనా రంగం వైపు పంపాలంటేనే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. తాజాగా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు యంగ్ హీరోయిన్ సాహితీ దాసరి.
తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కడం లేదనేది కాదనలేని వాస్తవం. అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ ఎందుకో తెలుగు అమ్మాయిలను టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ కోవలోకే వస్తారు సాహితీ దాసరి. పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు సాహితి. ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ.. చెప్పుకోదగ్గ పాత్రలు చేస్తున్నారు. దీనికంటే ముందు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి డ్యాన్స్ చేసి జనంలో పాపులర్ అయ్యారు.
ఈ వీడియోలో వైఎస్ జగన్ హోర్డింగ్ కనిపించడం వివాదాస్పాదమైంది. ఈమె వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేస్తోందని నెగిటివ్ టాక్ రావడంతో సాహితి క్లారిటీ ఇచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు నామినేషన్ వేసి షాకిచ్చింది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్, తన సినిమా కెరీర్ గురించి సాహితి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే…
నాకు ఐదు బ్రేకప్‌లు జరిగాయి.. 2012లో నా ప్రేమ ప్రయాణం మొదలైంది. తెలియని వయసులో కొన్ని జరిగాయి. ఫస్ట్ లవ్ ఐదేళ్లు నడిచింది, ఆ తర్వాత డ్యూరేషన్ తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ రెండు రిలేషన్స్ సెట్ కాలేదు.. ఒకటి క్యాస్ట్ ఫీలింగ్, రీజయన్ డిఫరెన్స్ వచ్చాయి. నన్ను ప్రేమిస్తూనే.. నా బాయ్‌ఫ్రెండ్ మరో ఇద్దరు అమ్మాయిలతో తిరిగేవాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో తిరిగేవాడు. బ్రేకప్ అయిపోయిందని చెప్పి రిలేషన్ అలాగే కంటిన్యూ చేసేవాడు. దాంతో నేను ఒక అమ్మాయికి నేరుగా కాల్ చేసి అడిగితే ఆమె నిజం చెప్పేసింది. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారా? లేదా? అని మా బాయ్‌ఫ్రెండ్ ఫ్రెండ్స్‌కి కాల్ చేశా. ఒకరోజున స్నాప్‌చాట్‌లో టెక్ట్స్ చూసి షాకయ్యా. దాంతో ఆ అమ్మాయితో ఉంటావా? నాతో ఉంటావా అని అడిగానని తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టింది.
నాకు సినిమాలు ఓకే అయ్యాకే ప్రొడ్యూసర్స్‌కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఏదో ఒకటి అయిపోయేది. అలా నాలుగు సినిమాలకు హీరోయిన్గా సైన్ కూడా చేశా, అడ్వాన్స్ కూడా తీసుకున్నా. చివరికి నేను ఐరెన్ లెగ్ అయిపోతానేమోనని భయం వేసింది. మా అమ్మానాన్నలకి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. రెగ్యులర్ ఇన్‌కం ఉండదు… ఎప్పుడు డబ్బులు వస్తాయో? అసలు వస్తాయో రావోనని నాన్న భయపడేవారు. మా ఫ్యామిలీలో ఏ తేడా పనిచేసినా నేనే చేసేదానిని. నా బ్రేకప్స్ గురించి మా అమ్మకి తెలుసు.. రిలేషన్‌ని కాపాడటానికి అమ్మ చాలా ట్రై చేసింది. ఏ బ్రేకప్ కూడా నేను చెప్పలేదు.. వాళ్లే చెబుతారు, మళ్లీ వాళ్లే కావాలని వస్తారు అని సాహితి దాసరి తెలిపారు.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ… నా జీవితంలో చాలామంది కమిట్మెంట్ అడిగారు. డైరెక్ట్‌గా ఏది అడగరు.. మధ్యలో కొంతమంది ఉంటారు. కోఆర్డినేటర్, మేనేజర్, కొన్నిసార్లు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్లు ఇన్వాల్వ్ అవుతారు. అసలు వాళ్లు అడుగుతారా? లేక వీళ్లే ఇలా చెబుతారా అనేది తెలియదు. నువ్వు కొంచెం క్లోజ్‌గా ఉండాలి, నువ్వు మెసేజ్‌లు చేస్తే నీకు ఛాన్స్‌లు ఎక్కువ ఇస్తారు. ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ నుంచి ఇలాగే ఆఫర్లు వచ్చేవి. నేను ఫ్రెండ్లీగానే ఉండేదానిని.. ఒకరోజున నువ్వు కొంచెం డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉండు అని చెప్పారు. నేను ఫ్రెండ్లీగా క్లోజ్‌గానే ఉన్నాను కదా? ఇంకేంటీ అని అంటే.. నీకు తెలియదా, నీకు అర్ధం కాదా అనేవారు. ఒకసారి కలువు, డైరెక్టర్ గారితో మాట్లాడు అని చెప్పేవారు. అయితే నేను ముఖం మీదే తిట్టేసేదానిని.. మీ ఏజ్ ఏంటీ? మీరు చేసే పనులేంటీ? మీరు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారు? అసలు ప్రొఫెషనిలిజం లేదు మండిపడేదానిని. దాంతో నాకు ఛాన్స్‌లు ఇచ్చేవారు కాదు. అలా చాలా ఛాన్స్‌లు పోయాయని సాహితి దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/sahithi-dasari-shocking-revelations-and-casting-couch-controversy-in-tollywood-168457.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
