‘ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను’ | Actress Raasi Says No to Playing Prabhas’ Mother, Opens Up About Her Admiration

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు ప్రభాస్. ‘వర్షం’విజయంతో ప్రభాస్ పేరు ఇండస్ట్రీలో మారుమోగించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’తో మాస్ స్టార్‌గా ఎదిగి, తన ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో యూత్‌లో డ్రీమ్ బాయ్‌గా మారారు. ఇక’బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. కల్కి, సలార్ వంటి సినిమాలతో తన రేంజ్ మరింత రెట్టింపు అయ్యింది. ఇలాంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఎవ్వరూ వదులుకుంటారు. అయితే.. ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ పక్కన నటించాలంటే కండీషన్స్ పెడుతుంది. అలాంటి రోల్స్ లో నటించనని చెబుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె కండీషన్స్ ఎంటీ?

ఆ నటి మరెవరో కాదు… ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన స్టార్ హీరోయిన్ రాశి. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె, చిన్న వయసులోనే ఆదిత్య 369, పల్నాటి పౌరుషం వంటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత తమిళంలో హీరోయిన్‌గా తనకెరీర్ ను ప్రారంభించింది.ఆ ఫేమ్ తో తెలుగులో గోకులంలో సీత, శుభాకాంక్షలు, పండుగ, సముద్రం వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 90వ దశకంలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్రనటిగా తనదైన ముద్ర వేసుకుంది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టి, సీరియల్స్, టీవీ షోలో పాల్గొంటు ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న హీరోయిన్ రాశి.. రెబల్ స్టార్ ప్రభాస్‌పై తన అభిమానాన్ని మరోసారి బయటపెట్టింది. ఆమె, ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశంపై ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రాశి మాట్లాడుతూ..’ప్రభాస్ అంటే నాకు కెరీర్ ప్రారంభం నుంచే చాలా ఇష్టం. ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నా. తర్వాత ‘చత్రపతి’, ‘బాహుబలి’ సినిమాలతో అది నిజమైంది’ అని చెప్పింది. ప్రభాస్ సినిమాలు చూసేందుకు ప్రత్యేకంగా థియేటర్‌కి వెళ్తానని, ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని వెల్లడించింది.

అయితే ప్రభాస్‌తో కలిసి నటించే విషయానికి వస్తే, ఆమె ఒక కండిషన్ పెట్టింది.’ఏ క్యారెక్టర్ అయినా చేస్తా.. కానీ ఆయనకు తల్లిగా మాత్రం నటించను. వయసు కూడా దాదాపు దగ్గరే ఉంటుంది. అక్క, వదిన పాత్రలు అయితే ఓకే… కానీ అమ్మ పాత్ర మాత్రం చేయలేను’ అని క్లియర్‌గా చెప్పింది. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా రాశి మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. ‘ప్రభాస్ సినిమాల్లో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ‘మిర్చి’ సినిమాలో నదియాకు, అలాగే ‘రాధే శ్యామ్’కి డబ్బింగ్ చెప్పాను. కానీ ఇంతవరకు ప్రభాస్‌ను వ్యక్తిగతంగా కలవలేదు’ అని తెలిపింది. ఆయన మాట్లాడే తీరు, మేనరిజం, ఇతరులకు ఇచ్చే గౌరవం తనకు చాలా ఇష్టమని చెప్పింది. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ను చూసిన తర్వాత ఆయన ఇమేజ్‌ను మరలా ఊహించుకోవడం కూడా కష్టమైందని రాశి అభిప్రాయపడింది. ఆ పాత్రలో ఆయన చూపిన రాజసం, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ తనకు ప్రత్యేకంగా అనిపిస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే, గతంలో మంచు లక్ష్మి కూడా ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రభాస్‌కు అక్కగా లేదా తల్లిగా నటించనని ఆమె చెప్పిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు రాశి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో ఈ టాపిక్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/actress-raasi-says-no-to-playing-prabhas-mother-opens-up-about-her-admiration-168493.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo