
టాలీవుడ్‌లో తన అందం, అభినయం, ముఖ్యంగా అదిరిపోయే ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి హంసా నందిని. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడింది. అయితే ఆ కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, ఆ వ్యాధిని జయించింది. మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించిన హంసా నందిని ఇప్పుడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. అయితే.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోషూట్ ను షేర్ చేసి, ఎమోషనల్ స్టోరి రాసుకొచ్చింది. షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?
నటి హంసా నందిని ఈ పోస్టులో తన జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని అధిగమించి తీరు గురించి భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఆమె తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘బలమైన వెన్నెముక, మృదువైన హృదయం, మనసారా నవ్వే నవ్వు… ఎన్నోసార్లు విరిగిపోయాయి. కానీ మళ్లీ నన్ను నేను నిర్మించుకున్నాను. ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచి, కొంత నిర్మించుకున్నా.. అలా ఎన్నోసార్లు చచ్చి బతికాను’అంటూ తన జీవిత పోరాటాన్ని వివరించారు.
అంతేకాకుండా తాను పర్ఫెక్ట్‌గా కనిపించడానికి లేదా ఎవరికైనా నచ్చడానికి ఇక్కడ లేనని ఆమె స్పష్టం చేశారు. తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, గాఢంగా ప్రేమించడానికి, తనకంటూ ఉన్న స్థలాన్ని ధైర్యంగా ఆక్రమించడానికి మాత్రమే జీవిస్తున్నానని చెప్పారు. ప్రతి మహిళ తన కథను తానే రాసుకుంటుందని, ఆ కథ గందరగోళంగా ఉన్నా, అద్భుతంగా ఉన్నా, ఆపలేనిదిగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హంసా నందిని ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఆ సందర్భంగా తన ఫోటోలను కూడా ఆ ఎమోషన్ పోస్టులో చేర్చారు.
హంసా నందిని పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె మాటలు ఎంతో మందికి ప్రేరణగా మారాయని, మహిళల జీవితంలో ధైర్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది. హంసా నందిని జీవిత ప్రయాణం చాలా మందికి ప్రేరణ. టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్, ముఖ్య పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే క్యాన్సర్ అనే మహమ్మారి బారిన పడింది. దీంతో ఆమె సినిమాలకు విరామం ప్రకటించి చికిత్స తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా ఆ వ్యాధిని జయించారు. కష్టాల మధ్య కూడా చిరునవ్వుతో ముందుకు సాగడం ఎలా అనేది ఆమె జీవితం స్పూర్తిదాయకమనే చెప్పాలి.
సినిమాలకు దూరంగా ఉన్న హంసా నందిని తనలోని ప్రయాణ ప్రేమికురాలిని బయటకు తీశారు. ఒక సక్సెస్‌ఫుల్ ట్రావెల్ వ్లాగర్‌గా మారి ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ అనుభవాలను తన స్వాన్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో మంచి ఆదాయాన్ని గడించడమే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. విదేశీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. పలు అంతర్జాతీయ టూరిజం బోర్డులతో కలిసి ప్రమోషన్స్ చేయడం విశేషం.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/actress-hamsa-nandini-emotional-post-on-cancer-battle-goes-viral-on-womens-day-167847.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
