‘కింగ్ 100’లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ అలా.. | Nagarjuna’s King 100 Brings De-Aging Tech First Time to Tollywood

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించడం విశేషం. అధికారిక ప్రకటన లేకుండానే సైలెంట్‌గా షూటింగ్ కొనసాగుతుండటం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున కొత్త ప్రయోగం చేయబోతున్నారని, టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ వినూత్నంగా, ఓ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రయోగమేంటీ?

దర్శకుడు రా. కార్తీక్ .. కింగ్ 100 సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే.. సినిమా ప్రారంభం కాకముందే అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని, అయితే షూటింగ్ సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు. నాగార్జున లుక్, కథ, హీరోయిన్లు, బ్యాక్‌డ్రాప్ వంటి అంశాలపై వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ప్రధాన ఆకర్షణగా నిలిచేది డీ-ఏజింగ్ టెక్నాలజీ వినియోగం. నాగార్జునను 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వ్యక్తిగా వివిధ దశల్లో చూపించేందుకు ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు పెద్దగా వినియోగించని ఈ టెక్నాలజీ ద్వారా సినిమా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కథ పరంగా కూడా ఈ సినిమా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. తండ్రి-కొడుకు పాత్రల్లో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మూడు వేర్వేరు గెటప్స్‌లో కనిపిస్తూ, జీవితంలోని విభిన్న దశలను ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు చెబుతున్నారు. రియలిస్టిక్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన కథగా ఇది రూపొందుతోంది.

కాస్టింగ్ విషయానికి వస్తే, సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. టబు స్వయంగా నాగార్జున 100వ సినిమాలో భాగమవాలని కోరుకుందని సమాచారం. మరోవైపు ఐశ్వర్య రాజేష్ పేరు హీరోయిన్‌గా వినిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అలాగే ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భట్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. మొత్తంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న టాక్ ఆసక్తిని పెంచుతోంది. నాగార్జున ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని దర్శకుడు కార్తీక్ వెల్లడించారు. ‘శివ’, ‘రక్షకుడు’, ‘కూలీ’ వంటి క్లాసిక్ సినిమాల్లో కనిపించిన ఎనర్జీ, స్టైల్‌ ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్‌కు నాస్టాల్జిక్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా కొత్త తరానికి కూడా నాగ్ స్టైల్‌ను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.

నిర్మాణ విషయానికి వస్తే, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంగీతం బాధ్యతలను దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్నారు. యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ అన్ని కలగలిపిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా 2026 దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/gossips/nagarjunas-king-100-brings-de-aging-tech-first-time-to-tollywood-168773.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo