కొద్దిలో బతికిపోయిన సుమ కనకాల… ఆ 5 నిమిషాల్లో ముచ్చెమటలు | Suma Kanakala Gets Nervous During Biker Movie Interview with Dr Rajasekhar

టాలీవుడ్ స్టార్ యాంకర్‌గా, హోస్ట్‌గా దూసుకెళ్తున్నారు సుమ కనకాల. సినిమాలు, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, ప్రైవేట్ కార్యక్రమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు సుమ. టాలీవుడ్‌లో ఎలాంటి ఈవెంట్ జరిగినా సుమ ఖచ్చితంగా ఉండాల్సిందే. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ తమ ఈవెంట్స్‌‌కి సుమతోనే యాంకరింగ్ చేయించుకుంటారంటే అతిశయోక్తి కాదు. స్టార్స్‌ని మించి ఫాలోయింగ్‌తో స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సుమ. ఎలాంటి కార్యక్రమం అయినా స్క్రిప్ట్‌తో పనిలేకుండా అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోతారు. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు పదాలతో చెడుగుడు ఆడుకుంటూ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. అలాంటిది సుమ కనకాల ఓ సందర్భంలో వణికిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..

యంగ్ హీరో శర్వానంద్, టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన మూవీ బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. గుడ్ ఫ్రైడ్ కానుకగా ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌‌లో భాగంగా సుమ కనకాలతో చిట్ చాట్ నిర్వహించారు.

జీవితతో పాటు మా అమ్మాయిలిద్దరూ కూడా నాకు కోచ్‌‌లే. ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ చేద్దామా? వద్దా? అనే డిస్కషన్ నడిచింది. జీవిత మాత్రం ఇది చేయాలి, నిర్ణయించుకున్నారా? లేదా? అని అడిగారు. సినిమాలలో ఫస్ట్ హీరోయా? సెకండ్ హీరోయా? అన్నది తర్వాతి సంగతి. ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయి… ఎవరు సక్సెస్‌లో ఉన్నారో వాళ్లే విషయం ఉన్నవాళ్లు. అలాంటి రోల్స్ చేయాలంటే ముందు ఇలాంటి సినిమాలు చేయాల్సిందేనని ముగ్గురు చెప్పారు. వారి మాట విని తీసుకున్న ఈ నిర్ణయం ఇవాళ ఇంత సక్సెస్ అయ్యిందని రాజశేఖర్ తెలిపారు.

ఈ సినిమాలో చాలా సీన్స్‌కి డైలాగ్స్ ఉండవు. ఫస్ట్ టైం వాళ్లు కలిసినప్పుడు కానీ, క్లైమాక్స్‌లో కూడా డైలాగ్స్ లేకుండా కమ్యూనికేట్ చేయగలిగాం. అది నటీనటుల గొప్పదనమని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చెప్పారు. ఇంతలో మీరు సినిమా చూడకుండా.. చూసినవాళ్లని అడిగి తెలుసుకుని ఇంటర్వ్యూకి వచ్చేశారని రాజశేఖర్ పంచ్ వేయడంతో సుమ కంగారుపడింది. దానికి ప్రూఫ్‌గా టికెట్ చూపించాలని డైరెక్టర్ అడగటంతో సుమ ఫోన్ తీసి వెతికింది.

ఛీ ఛీ నా జీవితంలో ఇట్లాంటి రోజు కూడా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు నేను షాద్ నగర్‌లో ఉండి టికెట్ బుక్ చేసుకుని, మన ఎస్ఎల్ఎం టెర్మినస్‌లో వచ్చి చూశాను. అయినాసరే నేను మీకు టికెట్ ప్రూఫ్ చూపించాల్సిందే.. మణికంఠ టికెట్ ఏది రా అంటూ ఫోన్ మొత్తం వెతికేసి ఎట్టకేలకు టికెట్ కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది సుమ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యాంకర్ సుమ కాసేపు వణికిపోయింది, ఆ టికెట్ కనిపించకపోతే పరిస్ధితి ఏంటి? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/suma-kanakala-gets-nervous-during-biker-movie-interview-with-dr-rajasekhar-169143.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo