బిగ్‌బాస్ బంధాలన్నీ బూటకమే… జబర్దస్త్ నటి ఎమోషనల్ | Throwback: Jabardasth actor Patas Faima Shocking comment on Bigg Boss Relationships

పటాస్‌తో వెలుగులోకి వచ్చిన ఫైమా ఆ తర్వాత ఆ తర్వాత జబర్దస్త్, బిగ్‌బాస్ షోలతో తెలుగునాట తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈటీవీతో పాటు పలు ఛానెల్స్‌తో కామెడీ ప్రోగ్రామ్స్ చేస్తూ నవ్వులు పంచుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా.. బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి తన కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చి, తను కూడా నిలదొక్కుకుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పటాస్‌ కార్యక్రమం కోసం కాలేజీ స్టూడెంట్స్ కావాలని మా కాలేజీకి ఇన్విటేషన్ రావడంతో మా దగ్గర 500 రూపాయలు చొప్పున కలెక్ట్ చేశారు. అయితే అప్పుడు నా దగ్గర 500 రూపాయలు కూడా లేవు. మా ఫ్రెండ్ ఇచ్చింది.. కానీ నేను ఇప్పటికీ ఆమెకు బాకీ తీర్చలేకపోయా. పటాస్ షోలో ప్రోమో వల్ల మా ఊరిలో మా అమ్మ ఎక్కడ కనిపించినా.. నీ బిడ్డ టీవీలో కనిపించింది, బాగా చేసిందని గొప్పగా చెప్పేవారు. దాంతో ఇందులో ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. నాకు యాక్టింగ్ రాకపోయినా డైరెక్టర్ సంతోష్ అన్న.. నన్ను 2 షెడ్యూల్స్ ఎక్కించలేదు స్టేజ్. నేను నీకు నేర్పిస్తానని.. పక్కనే కూర్చోబెట్టుకుని అలా కాదు, ఇలా చేయాలని స్క్రిప్ట్ కూడా ఎలా చూసుకోవాలో ఆయనే నేర్పించారని ఫైమా పేర్కొన్నారు.

భాస్కర్ అన్నతో కలిసి ఈవెంట్స్‌కి వెళ్లేదానిని ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నా. చాలామందికి జబర్దస్త్‌లో కనిపించాలని కోరిక. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందిపడలేదు. అది కామెడీ షో కాబట్టి.. జనం కూడా కామెడీగానే తీసుకుంటున్నారు. జబర్దస్త్‌లోకి లేడీస్ రావడం వల్ల లేడీ గెటప్సే వేసేవారికి అవకాశాలు తగ్గిపోయిన మాట వాస్తవం, కానీ మేం కావాలని చేయలేదు కదా. ఒకప్పుడు వాళ్లు ఊపారు, ఇప్పుడు మేం ఊపుతున్నాం.. కొద్దిరోజులైతే మేం ఇద్దరం కలిసి ఊపుతామని ఫైమా చెప్పారు.

వేరే ఛానెల్స్‌తో పనిచేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి కూడా జబర్దస్త్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ పడలేదు. ఒకవేళ అగ్రిమెంట్ ఉండి ఉంటే.. సీజన్ 7లో పిలిచేవాళ్లేమో. సీజన్ 6కి వెళ్లినందుకు ఫీల్ కాలేదు కానీ, సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఉంటే బాగుండు అనిపించింది. సీజన్ 6లో నాకు గట్టిపోటీ అనిపించలేదు. రేవంత్ అన్నతోనే గొడవ పడేదానిని.. గేమ్స్‌లో కూడా ఆయనతోనే పోటీపడే దానిని. బిగ్‌బాస్ వల్ల నా జీవితానికి చాలా మంచి జరిగింది. ఎక్కడా నెగిటివ్‌గా ఆడలేదు, పాజిటివ్‌గానే ఆడా. బయటకొచ్చిన తర్వాత కూడా అందరూ బిగ్‌బాస్ ఫైమా అనే అని పిలిచేవారని ఫైమా వెల్లడించారు.

జబర్తస్త్ ఫ్రెండ్స్ బయట కలుద్దామని పిలిచినా నేను ఎక్కడికి వెళ్లేదానిని కాదు. నాకు నా ఇల్లే ప్రపంచం.. ఏ పనిలేకపోతే ఇంట్లోనే ఉంటా. బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలుద్దామని కొన్నిరోజులు హడావుడి చేసేవారు. గ్రూప్ మొత్తం మెసేజ్‌లతో హల్‌చల్.. కానీ రోజులు గడిచేకొద్ది వాయిస్ తగ్గిపోయింది. ఎవరూ పట్టించుకునేవారు కాదు. మూడు రోజుల మురిపెం అంటారు కదా అలా గడిచింది. ఫస్ట్‌లో ఏమో కలుద్దాం రండి.. కలుద్దాం రండి అంటూ ఫోన్‌లు చేసేవారు. ఇప్పుడు ఎవరైనా పిలుస్తారేమోనని చూస్తున్నా. నా ఇంటి గృహ ప్రవేశానికి కూడా ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ పిలిచా.. కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు.. నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్ధం చేసుకున్నా. అందరికీ షూటింగ్స్ ఉంటాయి.. ఆ డేట్‌కి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుందని నాకు తెలిసి కాబట్టి లైట్ తీసుకున్నా. కానీ తర్వాత వస్తామని చెప్పినవాళ్లు ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదని ఫైమా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/throwback-jabardasth-actor-patas-faima-shocking-comment-on-bigg-boss-relationships-169071.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo