బిగ్ బాస్ తనూజ నిజస్వరూపం ఇదే.. మా 11 ఏండ్ల బంధంలో .. | Serial actress Haritha Makes Emotional Comments on Thanuja Puttaswamy After Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9వ సీజన్‌తో బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికే సీరియల్ నటిగా మంచి పేరును సంపాదించిన ఆమె, ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు. షోలో మొదటి రోజు నుంచే తనదైన గేమ్ స్ట్రాటజీతో ముందుకు సాగుతూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈసారి బిగ్‌బాస్ తెలుగు మొదటి లేడీ విన్నర్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ, పడాల కళ్యాణ్ విన్నర్ కాగా.. తనూజ రన్నరప్‌గా నిలిచింది. తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ‘రియల్ విన్నర్’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఇలాంటి తనూజపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

తనూజపై కామెంట్స్ చేసిన నటి ఎవరో కాదు.. సీరియల్ నటి , బుల్లితెర శివగామిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటి హరిత(Haritha). నటి హరిత తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తనూజతో ఉన్న తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. తనూజ కోసం బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న హరిత, హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘గతంలో నాగార్జున గారితో కలిసి సినిమాలు చేశాను. అప్పట్లో ఎంత ఆప్యాయంగా పలకరించారో, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడారు. ఆయనను చూడగానే పుట్టింటికి వెళ్లిన భావన కలిగింది’అంటూ ఎమోషనల్ అయ్యారు.

తనూజతో 11 ఏళ్ల బాండింగ్
కంటెస్టెంట్ తనూజతో తన అనుబంధం 11 సంవత్సరాలనాటిదని హరిత వెల్లడించారు. ‘బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లే ముందు రోజు రాత్రే మా ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంది. మా మధ్య అంత మంచి బంధం ఉంది,’అన్నారు. హౌస్‌లో తనూజ ఊహించిన దానికంటే బాగా ఆడిందని, టాస్క్‌ల్లో చురుకుదనం, డ్రెస్సింగ్ స్టైల్, తన హక్కుల కోసం నిలబడే ధైర్యం అన్నీ తనను గర్వపడేలా చేశాయని తెలిపారు. ఇక తనూజతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘తనూజ ఎప్పుడూ నాతో ఒకటే మాట అంటుంది… రియల్ లైఫ్‌లో మీరు హరితమ్మ లాగా ఉండాలి. కానీ రీల్ లైఫ్‌లో మాత్రం అఖిలాండేశ్వరి లా స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది’ అంటూ హరిత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ మాటల్లో తనూజకు తనపై ఉన్న గౌరవం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ ఉన్న సమయంలో ‘ముద్దమందారం’ అంటూ విమర్శలు రావడం, బయట ట్రోలింగ్ జరగడం గురించి ప్రశ్నించగా హరిత స్పందించారు. ‘ఆ కామెంట్స్ విన్నప్పుడు నాకు కూడా చాలా బాధేసింది. నేను కూడా ఏడ్చాను. కానీ ఆ విలువ అందరికీ తెలియదు,’ అని స్పష్టంచేశారు. ‘ఒకరిని ఒక మాట అనడం చాలా సులభం. కానీ ఆ మాట వల్ల ఎదుటివారికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించరు. మాట్లాడిన వారికి ఆ క్షణంలో ఆనందం కలిగొచ్చు. కానీ ఆ మాట పడిన వారికి ఆ బాధ చాలా రోజులు, కొంతమందికి సంవత్సరాల పాటు ఉంటుంది’ అంటూ ఆమె భావోద్వేగంగా వివరించారు.

తాను ఏడ్చినా విమర్శిస్తారని, ఏడవకపోయినా మాట్లాడుతారని హరిత అన్నారు. ‘నేను ఏడ్చాను అనుకోండి… అన్నిటికీ ఏడుస్తావా అంటారు. కానీ ఆ కన్నీటి వెనుక మా కష్టం ఎంతుందో ఎవరికీ తెలియదు. మీకు అవి కన్నీళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ మేము నడిచిన దారి అది’ అని చెప్పడం గమనార్హం.’ముద్దమందారం’ సీరియల్ గురించి మాట్లాడుతూ, ‘అది కొందరికి ఒక సీరియల్ మాత్రమే కావచ్చు. కానీ మాకు అది జీవితం. మీరు చూస్తున్న ఈ అఖిలాండేశ్వరి అక్కడి నుంచే వచ్చింది,’ అని తన ప్రయాణాన్ని గుర్తుచేశారు.

‘మాట్లాడేవారు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వాటన్నింటిని పట్టించుకుంటూ ఉంటే మనం అక్కడే ఆగిపోతాం. ఆ మాటలను మనం ఎనర్జీగా మార్చుకోవాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. మనల్ని హర్ట్ చేయడానికి అడుగడుగునా ప్రయత్నాలు ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’ అంటూ హరిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో హరిత చెప్పిన మాటలు కేవలం తనూజ గురించే కాకుండా, విమర్శల్ని ఎలా స్వీకరించాలి, జీవితంలో ఎలా ముందుకు సాగాలి అన్నది తెలుస్తోంది.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/serial-actress-haritha-makes-emotional-comments-on-thanuja-puttaswamy-after-bigg-boss-telugu-9-167607.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo