
బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి.. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో లీడింగ్ హీరోయిన్‌గా నిలిచారు బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. నటన, అందం, డ్యాన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ టూ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో చోటు దక్కించుకుంటోంది. అలాంటి మృణాల్ ఠాకూర్‌కు అక్కినేని హీరో ఒకరు క్షమాపణలు చెప్పారు. మృణాల్‌కు సుమంత్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డెకాయిట్ మూవీకి షానీ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెకాయిట్‌లో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్, షానీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా డెకాయిట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి అక్కినేని హీరో సుమంత్ యార్లగడ్ద కీలక వ్యాఖ్యలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా చెల్లెలు బాగా కష్టపడుతుంది.. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ ఉదయం 10 గంటలకు ఓపెన్ అయితే తను 8 గంటలకే వెళ్లి కూర్చొంటుంది. సినిమా షూటింగ్ 7 గంటలకైతే.. తను 6 గంటలకే వెళ్తుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంత కష్టపడ్డారో స్వయానా చూశా.. ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నానని సుమంత్ అన్నారు.
సభా పూర్వకంగా ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నా.. ఇండస్ట్రీకి తరపున వచ్చిన వారందరికీ థ్యాంక్స్. మృణాల్ ఇక్కడే ఉంది.. సభాముఖంగా అందరికీ చెబుతున్నా.. నన్ను క్షమించు. నీ రామ్‌ని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు. సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నా.. నిజానికి ఇది సీతారామంలో ఈ సీన్ ఉంది, దీనిని ఎడిటింగ్‌లో తప్పనిసరి పరిస్ధితుల్లో తీసేయాల్సి వచ్చింది. దానికి నష్టపరిహారంగా నిర్మాతగా నేను, నా చెల్లెలు డెకాయిట్‌లో ఆఫర్ ఇచ్చాం. ఈ సినిమా నీకు మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని సుమంత్ పేర్కొన్నారు.
అడివి శేష్‌తో నాకు పర్సనల్ రిలేషన్ ఉంది. తనతో 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను షూటింగ్స్ లేనప్పుడు ఏఎంబీలోనే బతుకుతా.. విచ్చలవిడిగా సినిమాలు చూస్తాను. అడివి శేష్ ముఖాన్ని చూస్తే ఒక గ్యారెంటీ ఉంటుంది. ఆ సక్సెస్‌ను మేం కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. వెంకీ బావ, సురేష్ బావ కూడా చెప్పగానే వచ్చేశారని సుమంత్ వారికి థ్యాంక్స్ చెప్పారు. మృణాల్ విషయంలో సుమంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/hero-sumanth-apologizes-to-mrunal-thakur-at-dacoit-pre-release-event-169051.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
