
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు నటి ఇంద్రజ (Indraja). ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తూ, మరోవైపు టీవీ షోలలో జడ్జిగా అలరిస్తోంది. ముఖ్యంగా ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత అనుబంధాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)గురించి మాట్లాడిన ఇంద్రజ భావోద్వేగానికి లోనయ్యారు.
ఓ ఇంటర్య్వూలో ఇంద్రజ మాట్లాడుతూ.. సుధీర్‌తో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమని చెబుతూ, ‘సిద్ధూ నన్ను అమ్మ అని పిలుస్తాడు. నాకు అతను నిజంగా కొడుకు లాంటి వాడు’అని చెప్పింది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో తల్లి-కొడుకులుగా నటించడం, అలాగే టీవీ షోలలో కలిసి పనిచేయడం వల్ల ఆ బంధం మరింత బలపడిందని పేర్కొన్నారు. సుధీర్ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత తాను చాలా మిస్ అయ్యానని ఇంద్రజ వెల్లడించింది. ముఖ్యంగా ఒకసారి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో అతడిని అనుకరిస్తూ చేసిన స్కిట్ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది.
‘కార్టీక్ సుధీర్‌లా నటించి కళ్లద్దాలు తీసినప్పుడు.. నాకు ఒక్కసారిగా సుధీర్ గుర్తొచ్చాడు. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను’ అంటూ ఆమె ఆ ఘటనను గుర్తుచేసుకుంది. ఇంద్రజ తెలిపిన ప్రకారం, తాను సుధీర్‌ను ‘సిద్ధూ’ అని పిలుస్తుండగా, అతడు ప్రేమగా తనను ‘రాజీ’ అని పిలుస్తాడట. ఆ పేరు తన ఇంట్లో వాళ్లు కూడా పిలుస్తారని, ఆ పిలుపు తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ‘అమ్మ అని పిలిపించుకోవడం నాకు చాలా స్పెషల్. అది గౌరవంగా, అనుబంధంగా అనిపిస్తుంది’ అని ఆమె భావోద్వేగంగా చెప్పింది.
అంతేకాకుండా, జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా తనను ‘అమ్మ’ అని పిలుస్తాడని, అతడిని కూడా దేవుడు ఇచ్చిన కొడుకులా భావిస్తానని చెప్పింది. అతనికి తన చేతి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. ఇంద్రజ తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేసింది. ‘నాకు తెలిసిన విషయాలు నా దగ్గరే ఉంటాయి. ఎవరి గురించి బయట మాట్లాడడం నచ్చదు’ అంటూ తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌ను వివరించింది. అయితే.. సుధీర్ కు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడం బాధకరమని ఎమోషనల్ అయ్యారు.
ఇక వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన ఆమె, తన పెళ్లి గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది. తన భర్తను పెళ్లికి ఆరు సంవత్సరాల ముందే తెలుసని, ఆయన తమిళ సీరియల్స్‌లో నటించడంతో పాటు కథలు కూడా రాస్తారని తెలిపింది. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా ముందు ఎక్కువగా చూపించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో ఇంద్రజ చెప్పిన మాటలు ఆమె వ్యక్తిత్వం ఎంత సింపుల్‌గా, భావోద్వేగంగా ఉంటుందో చూపించాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌పై ఆమెకు ఉన్న అనుబంధం, అతనిపై చూపిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/actress-indraja-gets-emotional-about-sudigali-sudheer-says-she-missed-him-deeply-168685.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
