
గోల్డ్ స్మగ్లింగ్ కేసులోను, అలాగే మనీలాండరింగ్ కేసులో కన్నడ నటి రాన్యరావుకు ఎదురు దెబ్బ తగిలించింది. ట్రావెల్ డాక్యుమెంట్లకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారనే విషయం తాజా దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ED) అధికారులు ఆమె ఆస్తులను జప్తు చేస్తూ కొరడా ఝులిపించారు. అక్రమంగా బంగారం రవాణా చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
కన్నడ నటి రాన్యరావును మార్చి 3వ తేదీన డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి 1.5 కోట్ల విలువైన 14.2 కేజీల బంగారం కడ్డీలను కలిగి ఉన్నందున్న ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె సన్నిహితుడు తెలుగు నటుడు తరుణ్ కొండూరును కూడా మార్చి 9వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది.
రాన్యరావు విషయానికి వస్తే.. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కే రామచంద్రరావు కూతురైన ఆమె ఎయిర్‌పోర్టులో తన తండ్రికి ఉండే ప్రోటోకాల్స్‌ను ఉపయోగించుకొని కస్టమ్స్ చెకింగ్స్ తప్పించుకొనే వారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చే సమయంలో ఆమె కస్టమ్ తనిఖీల నుంచి మినహాయించే వారు. అలా ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చారు అనే విషయం విచారణలో స్పష్టమైంది.
రాన్య రావును అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఆస్తులు, అక్రమంగా బంగారం రవాణా విషయాలపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఆమెకు సంబంధించిన 34 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామని ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రాన్యరావు తన స్నేహితుడు తరుణ్ రాజు కొండూరుతో కలిసి అక్రమంగా బంగారాన్ని దుబాయ్, ఉగాండా దేశాల నంచి రవాణా చేశారు. దుబాయ్, ఉగాండాలోని బంగారం సప్లైదారులతో లావాదేవీలు కొనసాగించి ఇండియాకు బంగారాన్ని రావాణా చేసే వారు. వారికి హావాలా మార్గాల ద్వారా డబ్బు చెల్లించేవారు. ఇండియాలో అనేక రకాలుగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఈడీ అధికారులు వెల్లడించారు.
రాన్యరావుకు సంబంధించిన 34 కోట్ల ఆస్తులు జప్తు చేశాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 5 (1) ప్రకారం ఆస్తులను అటాచ్ చేశాం. మా విచారణలో తెలిసిన విషయాలు, సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొన్నాం. స్విట్జర్లాండ్, అమెరికాకు బంగారం రవాణా చేస్తామని చెప్పి.. ఆ కన్‌సైన్‌మెంట్‌ను ఇండియాకు తరలించారు. తప్పుడు సమాచారం ఇచ్చి అక్రమంగా బంగారం రవాణకు పాల్పడ్డారు అని ఈడీ అధికారులు తెలిపారు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/kannada-movies/heroine-ranya-raos-34-crores-assets-attached-by-enforcement-directorate-in-monely-laundering-case-158359.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
