భార్య కాళ్లు పట్టుకొన్న పుష్ప విలన్! | pushpa actor dhananjaya shocks everyone with his wife latest video

సినీ పరిశ్రమకి చెందిన ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక్క పాత్రతో మంచి బ్రేక్ అందుకోవాలని చూస్తాడు. అయితే అప్పటికే ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ అలాంటి ఒక్క రోల్ అనేది ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇలా కెరీర్లు స్టార్ట్ చేసిన కొన్నేళ్ల లోనే మంచి బ్రేక్ అందుకున్నటువంటి ప్రముఖ నటుల్లో కన్నడ నటుడు ధనంజయ కూడా ఒకరు.

కాగా ధనంజయ అనే కంటే మన తెలుగు ఆడియెన్స్ కి ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా ఆడియెన్స్ కి కూడా జాలి రెడ్డి గానే సుపరిచితం అని చెప్పవచ్చు. కాగా జాలి రెడ్డి ధనంజయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ చిత్రం పుష్ప ది రైజ్ లో ఒక బోల్డ్ రోల్ ని చేశారు. దర్శకుడు సుకుమార్ జాలి రెడ్డి అనే రోల్ లో ధనంజయని ఒక ఉమనైజర్ గా కొంచెం అడల్ట్ కంటెంట్ తోనే ప్రెజెంట్ చేస్తే అది బాగా క్లిక్ అయ్యిపోయింది.

ఇక్కడ నుంచి సెపరేట్ మార్క్ ని సొంతం చేసుకున్న ధనంజయ పుష్ప 2 లో కూడా నటించాడు. కాగా ఈ నటుడిని సినిమాలో అలానే చాలా మందికి రిజిస్టర్ చేస్తే తాను బయట మాత్రం చాలా కష్టాలు పడ్డాడని చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. కన్నడ సినిమా దగ్గర చాలా కష్టాలు ఎదుర్కొని ఇపుడు ఈ స్టేజికి తాను రాగా ఇటీవల కొన్ని రోజులు కితమే తాను ప్రేమ పెళ్లి కూడా చేసుకున్నాడు.

ధన్యత అనే ఒక డాక్టర్ ని చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోగా పుష్ప చిత్ర నిర్మాతలు కూడా తమ జాలి రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారు. అయితే తమ సినిమాలో అలా చూపించినప్పటికీ రియల్ లైఫ్ లో జాలి రెడ్డిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తన భార్యతో కలిసి ఉన్న ఒక వీడియో చూసి నెటిజన్స్ లో మరింత రెస్పెక్ట్ ని తాను అందుకున్నాడు.

అయితే పెళ్లి తర్వాత ఏ భార్య అయినా తన భర్త కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అయితే తన భార్య తనకి పెడుతుంటే తాను వద్దని వరిస్తున్నాడు. తాను పెడతా అన్నా సరే వద్దంటున్నాడు చివరికి తన పాదాలు ముట్టుకోనివ్వకుండానే పెట్టించుకున్నాడు. అయితే ఇదే ఒకెత్తు అయితే తిరిగి మళ్ళీ తన భార్య పాదాలకి తాను కూడా మొక్కడం అనేది బ్యూటిఫుల్ గా మారింది.

దీనితో ఈ వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సినిమాలో ఆడవారి పట్ల అంత అసభ్యంగా చూపించిన ఆ నటుడిలో ఇలాంటి యాంగిల్ ఉందా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రెజెంట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ధనంజయ పుష్ప పార్ట్ 3 లో ఫుల్ ఫ్లెడ్జ్ గా కనిపించనుండగా ఇటీవల తెలుగు సినిమా “జీబ్రా” లో మంచి పాత్ర సొంతం చేసుకున్నాడు. ఇలా ప్రస్తుతం సినిమాలూ, పర్శనల్ లైఫ్ లో కూడా తాను బిజీగా ఉన్నాడు.


Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/kannada-movies/pushpa-actor-dhananjaya-shocks-everyone-with-his-wife-latest-video-152725.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo