
ప్రెజెంట్ తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ప్రామిసింగ్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ స్టార్ నాని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు సినిమా దగ్గర సక్సెస్ అయ్యిన అతి కొద్దిమంది స్టార్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. కాగా నాని హీరోగా నటించిన ఎన్నో సినిమాలు దేనికదే వెరైటీ ట్రీట్ ఇస్తూ వచ్చాయి.
ఇలా ఇన్నేళ్ల కెరీర్లో పలు ట్రోల్స్ నెగిటివిటీ తను తట్టుకోని ఇంతటి వాడు అయ్యాడు. అయితే ఒకానొక సమయంలో ఓటీటీ స్టార్ అంటూ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే నానితో సినిమా చేస్తే అటు ఏదైతే ఓటీటీ ట్రోల్స్ వచ్చాయో అదే ఓటీటీలో మినిమం గ్యారెంటీ హీరోగా తను నిలవడమే కాకుండా థియేటర్స్ లో స్థిరంగా 100 కోట్లు వసూలు చేయగలిగే హీరోగా కొనసాగుతున్నాడు.
అయితే ఇలా నిర్మాతలకు, దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరోగా తను నిలవగా ఇప్పుడు ఊహించని విధంగా మరో కాంట్రవర్సీలో నాచురల్ స్టార్ ఇరుక్కున్నాడు. కాగా నాని నటించిన గత మూడు సినిమాలు హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూడు సినిమాల్లో ఒక సినిమా ఒరిజినల్ సినిమా కాదట. కనీసం చెప్పకుండా తమ సినిమాని రీమేక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అంటూ సదరు నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
మరి నాని నటించిన గత మూడు సినిమాలు చూస్తే రెండు మాస్ సినిమాలు “సరిపోదా శనివారం” అలాగే “దసరా” సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో పాటుగా క్లాస్ సినిమా “హాయ్ నాన్న” కూడా ఉంది. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమానే నాని కాపీ కొట్టాడు అంటూ ఒరిజినల్ సినిమా నిర్మాత అంటున్నారు. ఇంతకీ హాయ్ నాన్న సినిమాని ఎక్కడ నుంచి లేపేసారంటే కన్నడ సినిమా నుంచి సైలెంట్ గా కాపీ కొట్టేసారట.

కన్నడ నటుడు అరవింద్ అయ్యర్ నటించిన ఈ సినిమాని దర్శకుడు కార్తిక్ సరగర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని నిర్మాణం వహించిన పుష్కర మల్లికార్జునయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. నాని నటించిన హాయ్ నాన్న సినిమాని మా భీమసేన నలమహారాజ కి అనధికారిక రీమేక్ అని క్లెయిమ్ చేస్తున్నారు. కనీసం తమని సంప్రదించకుండా మా నుంచి రీమేక్ హక్కులు కూడా కొనకుండా ఆ సినిమా చేసేసి రిలీజ్ చేసారని ఆరోపించారు.

అలాగే నాని ఇంత చీప్ పని చేస్తాడా?? అంటూ నానిపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనితో నాని విషయంలో సరికొత్త ట్విస్ట్ ఊహించని విధంగా వైరల్ గా మారింది. అయితే దీనిపై నానీని అంటే ఎమోస్తుంది అని సినిమాని తీసుకొచ్చింది దర్శకుడు తప్పు దర్శకునిది అని నిర్మాతలు అంటే దర్శకుణ్ణి అనాలి అంటూ నాని అభిమానులు తనని వెనకేసుకొస్తున్నారు.
మరి దీనిపై నాని నుంచి కానీ నిర్మాతలు లేదా దర్శకుడు శౌర్యువ్ కానీ స్పందిస్తారేమో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం 2022 లో విడుదల అయ్యింది. అలాగే ఈ భీమసేన నలమహారాజ అనే సినిమా 2020లో వచ్చింది. అప్పట్లో కోవిడ్ రీత్యా మేకర్స్ ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేసారు. కాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక్క కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/kannada-movies/is-hi-nanna-unofficial-remake-of-this-kannada-movie-producer-makes-shocking-comments-151613.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
