O Romeo First Review: ఓ రోమియో మూవీ ఫస్ట్ రివ్యూ | O Romeo Movie Review By Censor Board: CBFC clears Shahid, Tripti Movie with A Certificate

హిందీలో స్టార్ హీరో, హీరోయిన్లు షాహిద్ కపూర్, నానా పాటేకర్, త్రిప్తి డిమ్రీ నటించిన తాజా చిత్రం ఓ రోమియో. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు రోహన్ నరులా స్క్రీన్ ప్లే అందించారు. హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాజిద్ నాడియాడ్ వాలా, విపిన్ అగ్నిహోత్రి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ చిత్రంలో తమన్నా భాటియా, దిశా పటానీ, విక్రాంత్ మెస్సీ, ఫరీదా జలాల్, అవినాష్ తివారీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సినిమాటోగ్రఫి: బెన్ బెర్నార్డ్, ఎడిటింగ్: ఆసీఫ్ షేక్, మ్యూజిక్: విశాల్ భరద్వాజ్ తమ బాధ్యతలు వహించారు. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ, రన్ టైమ్ ఇతర విషయాల్లోకి వెళితే…

ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ మూవీలోని కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో అడల్డ్ కంటెంట్ తప్పనిసరి అయిందని నిర్మాతలు, దర్శకులు తమ వాదనను వినిపించారు. అయితే కొన్ని సీన్లలో మార్పులు చేర్పులు చేసి సెన్సార్‌కు సమర్పించారు. అయితే అందుకు సంతృప్తి చెందని అధికారులు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.

ఈ సినిమాలో కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి అడల్డ్ బేస్ట్ మూవీ కేటగిరీలో చేర్చారు. ఈ చిత్రానికి ఏ (A) సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 18 ఏళ్లు దాటిన వారందరూ చూడొచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఈ సినిమాను చూసేందుకు అనుమతి లేదని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

ఓ రోమియో సినిమా కథ, కథనాలు డిమాండ్ చేయడంతో ఈ చిత్రం నిడివి ఎక్కువగానే సెట్ చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ప్రకారం ఈ సినిమా నిడివి 178 నిమిషాలు. అంటే ఈ చిత్రం రన్ టైమ్ సుమారుగా 2 గంటల 58 నిమిషాలుగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి షాహిద్, త్రిప్తి డిమ్రీ జంట మధ్య కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నానా పాటేకర్ పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది అని ఇన్‌సైడ్ రిపోర్ట్. ఈ చిత్రం ఎమోషనల్, లవ్ స్టోరీగా రూపొందిందని పేర్కొన్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/o-romeo-movie-review-by-censor-board-cbfc-clears-shahid-tripti-movie-with-a-certificate-166743.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo