Saraswathi Movie Twitter Review: సరస్వతి మూవీ ట్విట్టర్ రివ్యూ.. | Saraswathi Movie Twitter Review in Telugu: Is Varalaxmi Sarathkumar’s Movie hits the bulls eye?

Saraswathi Movie Twitter Review: మల్టీ టాలెండెండ్ యాక్టరస్ వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళ్, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు దర్శకురాలిగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘సరస్వతి’. ఈ సినిమా మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.విడుదలకు ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను విస్తృతంగా చేసింది. ఈ నేపథ్యంలో సరస్వతి సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

‘సరస్వతి’ సినిమాను దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకి ఆంటోని ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.ఇక ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు ప్రియమణి, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, మైమ్ గోపి, హరీష్ పెరాడీ, రఘుబాబు, గెటప్ శ్రీను, నివేష్క తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించారు.

‘సరస్వతి’ సినిమా కథ విషయానికి వస్తే.. సరస్వతి అనే 12 ఏళ్ల చిన్నారి. ఆమెను ఎంతో ప్రేమతో పెంచుకున్న తల్లి (వరలక్ష్మి శరత్‌కుమార్) జీవితంలో ఒక రోజు పెద్ద సంఘటన జరుగుతుంది. ఒక రోజు స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. తన కూతుర్ని వెతికి పెట్టాలని వేడుకుంటుంది. అయితే ఆ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అనూహ్యమైన ట్విస్ట్ బయటపడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? చిన్నారి మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆ కుట్రలో ఎవరి పాత్ర ఉంది? చివరకు తల్లి తన కూతుర్ని క్షేమంగా తిరిగి పొందగలిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘సరస్వతి’ సినిమా కథ.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/saraswathi-movie-twitter-review-in-telugu-is-varalaxmi-sarathkumars-movie-hits-the-bulls-eye-167697.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo