Saraswathi Movie Review: సరస్వతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Saraswathi Movie Review and Rating in Telugu: Varalaxmi Sarathkumar impresses as Director

నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియమణి, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, కిషోర్, నాజర్, తులసి, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, మైమ్ గోపి, హరీష్ పెరాడీ, రఘుబాబు, గెటప్ శ్రీను, నివేష్క తదితరులు
దర్శకత్వం: వరలక్ష్మి శరత్‌కుమార్
నిర్మాతలు: పూజా శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్
బ్యానర్‌: దోశా డైరీస్ ఎల్ఎల్‌పీ
మ్యూజిక్ డైరెక్టర్‌: ఎస్ థమన్
సినిమాటోగ్రాఫర్‌: ఏఎం ఎడ్విన్ సాకే,
ఎడిటర్‌: వెంకట్ రాజన్
ఆర్ట్ డైరెక్టర్‌: శ్రీధర్ మాచర్ల
కొరియోగ్రఫి: బృందా మాస్టర్
స్టంట్స్: నందూ మాస్టర్
రిలీజ్ డేట్: 2026-03-06

నర్స్ ఉద్యోగం చేసే లక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) సింగిల్ పేరెంట్‌. తన కూతురు సరస్వతి (నివేష్కా నాయుడు) అంటే పంచ ప్రాణాలు. తానే జీవితంగా బతుకుతుంది. సరస్వతి 12వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొంటారు. స్కూల్‌కు వెళ్లిన కూతురు అదృశ్యమైందని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రిన్స్‌పాల్ రూమ్‌లోనే ముగ్గురు చేతిలో మానభంగానికి గురైందనే విషయం తెలుస్తుంది. తల్లితో తన బాధను చెప్పి ప్రాణాలు విడుస్తుంది. ఆ షాక్‌లో ఎవరికీ చెప్పకుండా తన కూతురును శ్మశానికి తీసుకెళ్లి పూడ్చిపెడుతుంది. తన కూతురుకు, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చమని కోరితే ఎలాంటి సాక్ష్యాలు లేని కేసును ప్రముఖ లాయర్ (ప్రకాశ్ రాజ్) టేకప్ చేస్తారు. అయితే లక్ష్మీ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల కేసును డిస్మిస్ చేస్తుంది.

సరస్వతి అంటే లక్ష్మీకి ఎంత ప్రేమ ఉంది? కూతురు కనిపించకుండా పోయిన తర్వాత లక్ష్మీ పరిస్థితి ఏమిటి? సరస్వతి మిస్సింగ్ తర్వాత స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సమాధానం ఏమిటి? చనిపోయిన కూతురు బాడీని ఎవరికీ చెప్పకుండా లక్ష్మీ పూడ్చి పెట్టింది? ఈ కేసు విషయంలో పోలీసుల రెస్సాన్స్ ఏమిటి? సరస్వతి మానభంగం కేసును కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది? కోర్టు కేసును తిరస్కరించిన తర్వాత బయటకు వచ్చిన ఊహాకు అందని ట్విస్ట్ ఏమిటి? చివరకు సరస్వతి కేసులో లక్ష్మీకి న్యాయం జరిగిందా? అనే భావోద్వేగమైన ప్రశ్నలకు జవాబే సరస్వతి సినిమా కథ.

ఫాంటసీ ప్రోన్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతకు గురైన తల్లి ఎమోషన్స్ ఆధారంగా రూపొందిన కథ ఇది. తల్లి, కూతుళ్ల అనుబంధం, కళ్లముందే కూతురు అన్యాయం జరిగితే పోరాటం చేయలేని నిస్సత్తువ. సమాజంలో పలుకు బడి ఉన్న పెద్దల అధికార దుర్వినియోగం లాంటి అంశాలతో రాసుకొన్న కథ బాగుంది. ఈ కథను ఎమోషనల్ జర్నీగా చెప్పడానికి వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకురాలిగా ఎంచుకొన్న స్క్రీన్ ప్లే బాగుంది. కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదలిస్తాయి. ఫస్టాఫ్ వరలక్ష్మీ యాంగిల్ కథ నడిస్తే.. సెకండాఫ్‌లో ప్రియమణి కోణంలో కథ గుండెను పిండేసేలా ఉంటుంది.

దర్శకురాలిగా వరలక్ష్మీ సూపర్ సక్సెస్ అయింది. అయితే యాక్టర్‌గా మాత్రం తల్లి పాత్రకు కరెక్ట్ కాదని, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనేది నా అభిప్రాయం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ తెరపైకి తెచ్చి కథను నడిపించిన తీరు బాగుంది. చివరి ఫ్రేమ్ వరకు గ్రిప్పింగ్‌గా కథను చెప్పిన తీరు ఈ సినిమాకు బ్యూటీగా మారింది. అయితే ఇలాంటి కథలు ఇప్పటికే చాలానే వచ్చాయి. కొత్తగా థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా లేకపోవడం వల్ల రెగ్యులర్ సినిమాలా అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. వరలక్ష్మీ నటిగా బెటర్‌గానే చేసిందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇంకా బెస్ట్ ఇవ్వడానికి స్కోప్ ఉన్న పాత్ర అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకురాలిగా, నిర్మాతగా, ఇంకా అనేక బాధ్యతలు భుజాన వేసుకోవడం వల్ల ఓవర్ బర్డెన్ అయిందా? అందుకే తెర మీద పూర్తిస్థాయిలో రాణించలేదా? అనే సందేహం కలుగుతుంది. ఈ సినిమాకు వెన్నెముకలా ప్రకాశ్ రాజ్ తన పాత్రతో ఫుల్ సపోర్టుగా నిలిచారు. ప్రియమణి, కన్నడ కిషోర్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారిన పాత్రల్లో కనిపించడమే కాకుండా సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చారు. నాజర్, రాధిక శరత్ కుమార్ తదితరులు గుర్తుండిపోయేలా నటించారు.

సరస్వతి సినిమా స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే తల్లికూతుళ్ల ఎమోషనల్ జర్నీ. కథను అనేక మలుపులతో ఆడియెన్స్‌కు ఆసక్తిని రేపేలా ట్విస్టులు డిజైన్ చేయడం ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమా లైవ్లీగా మార్చాయి. ఎడిటింగ్ విభాగం ఛాలెంజ్‌తో కూడిన అవుట్‌పుట్‌ను ఇవ్వడమే కాకుండా స్టోరీలో ఉండే సోల్‌ను ఎమోషన్స్‌ను బాగా ప్రజెంట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయి. ప్రతీ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా నటీనటుల ఎంపిక విషయంలో టీమ్‌ను అభినందించాలి. కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి, రేప్, మర్డర్ అంశాలతో వచ్చే క్రైమ్, సస్సెన్స్ సినిమాలను ఆదరించే వారికి సరస్వతి నచ్చతుంది. సీరియస్‌గా సాగే ఓ రకమైన ఎమోషనల్ జర్నీ. థియేటర్‌లోనే చూడండి.. ఓ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/saraswathi-movie-review-and-rating-in-telugu-varalaxmi-sarathkumar-impresses-as-director-167709.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo