Dhurandhar The Revenge Trailer review: ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ | Dhurandhar The Revenge Trailer review: Ranveer Singh returns with Intense action-drama Creates Massive Buzz

ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై, యాక్షన్ మూవీ ధురంధర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2)ను 2026 మార్చి 19న రణ్‌వీర్ సింగ్ మూవీకి సీక్వెన్స్ రిలీజ్ అవుతుందని తెలిపారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మార్చి 7న ధురంధర్ 2 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరి ధురంధర్ 2 ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా అనేది పరిశీలిస్తే..

ధురంధర్ 2 తారాగణం ధురంధర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ధురంధర్ : ది రివెంజ్ అనే టైటిల్ ఖరారు చేశారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. తొలి భాగం కేవలం ఒక్క హిందీలో మాత్రమే విడుదల కాగా.. సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి తప్పు చేయకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.

ధురంధర్ 2 ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రారంభంలోనే ఓ రెచ్చగొట్టే సన్నివేశంతో మొదలవుతుంది. విమానంలో ఒక ఉగ్రవాది.. హిందూ సమాజాన్ని పిరికిదిగా వ్యాఖ్యానిస్తాడు. ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న అజయ్ సన్యాల్ (మాధవన్) ఇది వింటాడు. ఆ వెంటనే రెహమన్ డెకాయిట్ మరణం తర్వాత ల్యారీని ఎవరు పాలిస్తారు? తర్వాత బాధ్యతలు అప్పగించాలి? అనే దానిపై ముఠాల మధ్య అనిశ్చితిని ట్రైలర్‌లో చూపించారు.

ఈసారి రణ్‌వీర్ జస్కిరత్ సింగ్‌ రంగీగా ఎంట్రీ ఇస్తున్నాడు. ల్యారీని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి దశలవారీగా వ్యూహాలు రచిస్తున్నట్లు చూపించారు. ల్యారీ కా బాద్షా అని కూడా చూపించడంతో ల్యారీని రణ్‌వీర్ తన గ్రిప్‌లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తొలి భాగంలో రెహమాన్ డెకాయిట్‌ నడిపే బలూచ్ ముఠాలోకి చొరబడిన భారతీయ గూఢచారిగా రణ్‌వీర్ కనిపించాడు. ధురంధర్ 2లో మాత్రం ఒక ఉగ్రవాద సంస్థను కూల్చేసేందుకు ముఠా లోపలి నుంచి జస్కిరత్ ఎలా పనిచేస్తాడు? తన ప్లాన్ ఎలా వర్కవుట్ చేశాడన్నది ఆసక్తికరంగా చూపించనున్నారు. చివరిలో ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును భారతదేశం నిర్ణయిస్తుందని రణ్‌వీర్ సిగరెట్ కాలుస్తూ స్టైల్‌గా చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.

హై ఎండ్ యాక్షన్ ఎపిసోడ్స్, రక్తపాతంతో ధురంధర్ 2 వయలెంట్‌గా కనిపిస్తోంది. తొలి అర్ధభాగాన్ని మించి ఇందులో హంజా విధ్వంసం సాగేలా ఉంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్‌లు కూడా ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మొత్తం మీద తాజా ట్రైలర్‌తో ధురంధర్ 2పై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. యష్ నటించిన టాక్సిక్ నుంచి పోటీ లేకపోవడంతో ధురంధర్ 2 మార్చి 19న భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“>

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/dhurandhar-the-revenge-trailer-review-ranveer-singh-returns-with-intense-action-drama-creates-mass-167765.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo