100 ఎకరాలు ఉంటేనే పెళ్లి.. స్టార్ హీరోయిన్ కండీషన్స్ | Meenakshi Chaudhary Reveals Shocking Marriage Condition: ‘He Must Own 100 Acres’

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో ప్రేక్షకులను కోట్లాది మంది అబిమానులను సొంతం చేసుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ భామ, ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీనాక్షి పెట్టిన ఈ కండిషన్స్ చూసి నెటిజన్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏ కండీషన్స్ ఏంటీ?

మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి మొదట చిన్న చిన్న అవకాశాలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ‘ఈచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించకపోయినా, మీనాక్షి నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఇందులో ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా మంచి గుర్తింపు వచ్చింది.

తర్వాత మీనాక్షి చౌదరికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే.. కెరీర్‌లో హిట్స్ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, కొన్ని సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘హిట్ ది సెకండ్ కేస్’సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఇక గతేడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ విజయం అందుకుంది. ఇక తాజాగా ‘అనగనగ ఒక రోజు’ కూడా హిట్ అయ్యింది.

అలాంటి మొగుడు కావాలి?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి.. కాబోయే భర్త ఎలా ఉండాలి? అనే ప్రశ్నకు తన మనసులో మాటను బయటపెట్టింది. ‘నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా ఇండస్ట్రీకి చెందినవాడు లేదా పెద్ద బిజినెస్‌మాన్ కావాల్సిన అవసరం లేదు. అతను సాధారణ వ్యక్తి అయినా సరిపోతుంది. కానీ, అతనికి కనీసం 100 ఎకరాల భూమి ఉండాలి’అని ఆమె చెప్పింది. ఇక్కడితో ఆగకుండా తన భర్తకు ఉండాల్సిన ఇతర లక్షణాలను కూడా వివరించింది. ‘వంట చేయడం రావాలి, బట్టలు ఉతకడం రావాలి, ఇస్త్రీ చేయడం రావాలి. ఇంట్లో జరిగే పనులన్నీ చూసుకునే వ్యక్తి అయితే నాకు చాలా ఇష్టం’ అని చెప్పింది.

మీనాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి ఆశ్చర్యంగా అనిపించినా, ఆమె చెప్పిన ఉద్దేశం మాత్రం భిన్నంగా ఉందని అభిమానులు చెబుతున్నారు. భర్తగా వచ్చే వ్యక్తి బాధ్యతాయుతంగా ఉండాలి, ఇంటి పనుల్లో కూడా భాగస్వామిగా ఉండాలి అనే భావనతోనే ఆమె ఈ మాటలు చెప్పినట్లు అర్థమవుతోంది. మీనాక్షి చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనాక్షి పెట్టిన ఈ కండిషన్స్ చూసి నెటిజన్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమె చెప్పిన షరతులను సరదాగా తీసుకుంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ‘100 ఎకరాల భూమి అంటే పెద్ద కండిషన్ కదా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/meenakshi-chaudhary-reveals-shocking-marriage-condition-he-must-own-100-acres-167863.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo