
స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, విజయ్ అఫైర్ వ్యవహారంపై పలు రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. అయితే ముఖ్యంగా నటుడు పార్తీబన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉండటంతో చర్చనీయాంశమయ్యాయి. అయితే పార్తీబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష మండిపడటం.. ఆమె చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. అయితే తాను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆమె దురుసుగా ట్వీట్ చేశారనే అంశంపై పార్టీబన్ ఘాటుగా స్పందించాడు. ఈ వ్యవహారంలో ఆమె ప్రవర్తన బాగాలేదని మీడియా సమావేశం పెట్టి బ్లాస్ట్ చేశాడు. అయితే త్రిష, పార్తీబన్ మధ్య వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
విజయ్‌తో ఓ సీనియర్ హీరోయిన్‌కు ఉన్న అఫైర్ వల్లే మా కాపురంలో కలతలు ఏర్పడ్డాయి. వారి వివాహేతర సంబంధం కారణంగా నేను మానసిక క్షోభకు గురయ్యాను. కాబట్టి విడాకులు ఇప్పించండి అంటూ విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. ఆ తర్వాత విజయ్, త్రిషలు కలిసి ఓ మ్యారేజ్ ఫంక్షన్‌కు రావడం మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అయితే విజయ్, త్రిష బంధాన్ని దృష్టిలో పెట్టుకొని నటుడు పార్తీబన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రిషా ఇంటి నుంచి బయటకు రావడం ప్రమాదకరం. ఆమె ఇంటిలోనే ఉండాలి అని పార్తీబన్ ఓ సమావేశంలో కామెంట్ చేశాడు. అయితే పార్తీబన్ చేసిన కామెంట్స్‌కు హీరోయిన్ త్రిష నొచ్చుకొన్నది. మైక్ చేతిలో ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా? కొన్ని విషయాల్లో నోటికి అదుపు ఉండాలి అని ఆమె ట్వీట్ చేసి మరింత ఘాటుగా స్పందించారు.
అయితే త్రిషా చేసిన ట్వీట్‌కు ముందే పార్తీబన్ తన చేసిన కామెంట్స్ విషయంలో రియలైజ్ అయ్యాడు. వెంటనే ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. దాంతో ఈ వివాదం సమసిపోయిందనే అనుకొన్నారు. కానీ తాను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా త్రిషా ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం చెందారు. తాజాగా మరో ప్రెస్ మీట్లో పార్తీ మాట్లాడుతూ.. త్రిషా నాపై చేసిన ట్వీట్లోని ఆరోపణలు పూర్తిగా నిరాధారం..అందులో వాస్తవం లేదు. నేను త్రిషాకు ముందే సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాను. అయినా అదేం పట్టించుకోకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేసింది అని పార్తీబన్ అన్నాడు.
త్రిషాపై భగ్గుమంటూ.. కొన్నిసార్లు తెలియకుండా తప్పు జరిగిపోతుంది. తప్పు చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. గలాటా ఈవెంట్లో తప్పు జరిగిందని నేను రియలైజ్ అయి సారీతో సరిదిద్దుకొన్నాను. నేను అజిత్, విజయ్ గురించి మాట్లాడుతుంటే త్రిషా ఫోటో స్క్రీన్‌పై ఫ్లాష్ అయింది. ఆ విషయం నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఏం మాట్లాడాలనే విషయం అర్ధం కాలేదు. కానీ త్రిషాను అవమానించేలా మాట్లాడాననే విషయం తప్పుగా ప్రొజెక్ట్ అయింది. నిజంగా నేను మాట్లాడింది తప్పే. నాకు ఎవరో డబ్బులిస్తే నేను మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు అని పార్తీబన్ అన్నారు.
క్షమాపణలు చెబుతూ నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత త్రిషా ట్వీట్ చూశాను. నాకు సంబంధం లేని వ్యక్తి గురించి నేను మాట్లాడటం సరికాదు. విజయ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. చట్టపరంగా భార్య అయిన సంగీత గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఇంటిలోనే ఉండాలని అనడం తప్పే. ఒకవేళ త్రిషా ట్వీట్ చూసి ఉంటే.. నేను క్షమాపణల వీడియోను పోస్టు చేసి ఉండే వాడిని కాదు. అనవసరంగా ఆమెకు క్షమాపణలు చెప్పాననే భావనతో పార్తీబన్ మాట్లాడారు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/tamil/tamil-actor-parthiban-blast-trisha-krishnans-tweet-row-167879.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
