
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వరుస సినిమా విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే, గతంలో కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న సమంత.. రీ ఎంట్రీ తరువాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. ఇప్పటికే దక్షిణాది సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది. అయితే, సమంత ఇప్పుడు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులో సమంత హీరోయిన్గా కనిపించే అవకాశం ఉందట. ఇంతకీ మ్యాటరేంటీ?
ఇక సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్’మా ఇంటి బంగారం’సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సమంత నిర్మాత కూడా. ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రాజ్ & డీకే నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్’అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ సరసన కూడా సమంత కనిపించనుంది.
ఇదిలాఉంటే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే ఓ భారీ సూపర్ హీరో ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రముఖ దర్శక ద్వయం రాజ్ & డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో సక్సెస్ అందుకున్న ఈ దర్శకులు ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒక పాన్ ఇండియా స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ హీరో కాన్సెప్ట్‌పై ఉండబోతుందన్న వార్తలు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లో సమంత పోషించిన రాజి పాత్రకు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ తో కూడా సమంత .. రాజ్ & డీకేతో కలిసి పనిచేసింది. సమంత క్రేజ్ ఈ ప్రాజెక్ట్ కు యాడ్ అవుతుందనే ఉద్దేశంతో ఆమె పేరును ముందుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో సమంత ఎంపికైతే, సల్మాన్ ఖాన్‌తో ఆమె తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
అయితే ఈ పాత్ర కోసం మరో సౌత్ స్టార్ నయనతార పేరు కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.’జవాన్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన నయనతారను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సమంత లేదా నయనతారలో ఎవరిని ఎంపిక చేసినా సినిమా బిజినెస్‌కు భారీ ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ సినిమాను ఆగస్టు లేదా ఆ తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కథ, ఇతర నటీనటులు, టైటిల్ వంటి వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచింది.
అయితే సల్మాన్ ఖాన్ కెరీర్లో పూర్తిస్థాయి సూపర్ హీరో పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో సమంత హీరోయిన్గా ఎంపికైతే అది బాలీవుడ్లో ఆమెకు మరొక పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/gossips/samantha-ruth-prabhu-likely-to-pair-with-salman-khan-in-raj-dk-superhero-film-167897.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
