Brahmamudi March 14th Episode: ఇందూని కాపాడిన స్వరాజ్.. అపర్ణపై రేఖలో అనుమానం | Brahmamudi Serial March 14th 2026 Episode 980 Here is Today’s full story

Photo Courtesy: JioHotstar

తమ్ముడిని మోసం చేసి పబ్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు స్వరాజ్. ఫ్రెండ్‌తో మాట్లాడి స్వాతిని పబ్‌కి పంపిస్తుంది స్వాతి. అదే పబ్‌లో ఒక స్మగ్లర్ గురించి వెతుకుతూ ఉంటుంది నందూ. ఇంతలో అనుకోకుండా నందూని గుద్దుకోవడంతో ఐశ్వర్య నానామాటలు అంటుంది. ఆమెకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది నందూ. ఇందూని చూసిన రాఖీ.. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ట్రాప్ చేయాలని చూస్తాడు. ఇందుకు అడ్డుగా ఉన్న సంతోష్‌ని ఆఫీస్‌కి పంపిస్తాడు. స్కాచ్ తాగుతున్నా ఎక్కకపోవడంతో బేరర్‌ని చితకబాదుతాడు లక్కీ. దాంతో స్వరాజ్ అతనిని కూల్ చేసి చీప్ లిక్కర్ తీసుకురమ్మని చెబుతాడు.

స్మగ్లర్ పబ్‌కి రావడంతో అతని గురించి పోలీసులకు ఇన్ఫర్మ్ చేస్తుంది నందూ. అతనికి కనిపించకుండా ఉండేందుకు గాను అప్పుడే అక్కడికి వచ్చి వెంకీతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. నీకు నా పీఏగా జాబ్ ఇస్తాను.. కానీ నేను పెట్టే టెస్టులలో పాస్ కావాలని రాఖీ చెప్పడంతో ఇందూ సరేనని అంటుంది. ఆమెకు మందు పోస్తుండగా వద్దు అని చెప్పడంతో రాఖీ ఈగో హర్ట్ అవుతుంది. పబ్‌లో పరిస్ధితులు చూసి ఇందూకి అనుమానం వస్తుంది. అయితే జాబ్ కోసం అన్నింటినీ మౌనంగా భరిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 14వ తేదీ ఎపిసోడ్ 980లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar

నాకు రోజూ ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉంటాయి. వెళ్లిన ప్రతిచోట తాగుతూనే ఉంటాను, కానీ నా పీఏ మాత్రం అలర్ట్‌గా ఉండాలి. తనకి తాగే అలవాటు ఉండకూడదు. మీకు ఆ అలవాటుందో లేదోనని టెస్ట్ చేశాను. అందులో మీరు పాస్ అయ్యారని ఇందూతో అంటాడు రాఖీ. మీలో ఉన్న స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటీ అని అడగ్గా.. కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడటం అని చెబుతుంది ఇందూ. ఏదైనా ఒక పని మొదలుపెడితే పూర్తయ్యే వరకు కష్టపడతానని అంటుంది. రాత్రిపూట వర్క్ చేయడం మీకు ఇష్టమేనా? అని అడుగుతాడు రాఖీ. రాత్రిపూట బయటకు రావడం చాలా కష్టం.. ఎంత పని ఉన్నా ఇంటి దగ్గరి నుంచే పూర్తి చేస్తానని చెబుతుంది ఇందూ. ఎక్కడి నుంచి పనిచేస్తే నాకు అనవసరం.. వర్క్ పూర్తి చేస్తే చాలని అంటాడు రాఖీ. అప్పుడు మన పని ఎలా పూర్తవుతుందని అతని ఫ్రెండ్ అడగ్గా.. రాఖీ సీరియస్ అవుతాడు.

వర్క్ విషయంలో సొంతంగా ఆలోచిస్తావా? లేక నేను చెప్పిందే ఫాలో అవుతావా? అని అడుగుతాడు రాఖీ. సొంతంగా ఆలోచిస్తాను, మీరు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దానిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తానని చెబుతుంది ఇందూ. నేను ఏం చెబితే అది చేసేవాళ్లు నాకెందుకు, నా తప్పుల్ని సరిదిద్దేవాళ్లే నాకు కావాలని చెబుతాడు రాఖీ. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రంగా ఉంది, ఇంతకు ముందు ఎక్స్‌పీరియన్స్ లేదని రాఖీ అంటాడు. నేను ఏదైనా త్వరగా నేర్చుకుంటానని, తనకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అని అంటుంది ఇందూ. నాతో కలిసి పనిచేయడానికి నీకేమైనా భయంగా ఉందా? అని అడుగుతాడు రాఖీ.

నిజాయితీగా ఉన్నవాళ్లే స్ట్రిక్ట్‌గా ఉంటారు.. అలాంటప్పుడు నేను నిజాయితీగా పనిచేస్తే చాలు కదా అని అంటుంది ఇందూ. మిమ్మల్ని చూసి భయపడితే జాబ్ ఎలా చేస్తానని అడుగుతుంది. నువ్వు టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నావు.. నువ్వు రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తానని వెళ్తాడు రాఖీ. మరోవైపు.. అర్ధరాత్రి కూడా పనిచేస్తున్న రేఖ దగ్గరికి భ్రమరాంబ వచ్చి ఎందుకు ఇంతసేపు అని అడుగుతుంది. రేపు ఆ ఇందూ సంతకం పెట్టాక మనకి వచ్చే ఆస్తి విలువ ఎంతో లెక్కకడుతున్నానని అంటుంది రేఖ. ఏయే ఆస్తులు ఎక్కడున్నాయో అంచనా వేస్తున్నాను అంటుంది. వీళ్లకు వైజాగ్, విజయవాడలో కూడా ఆస్తులు ఉన్నాయా అని అడుగుతుంది భ్రమరాంబ.

దేశరాజధాని ఢిల్లీలో కూడా ఉన్నాయి.. లేకపోతే మా అమ్మ అంతలా ఎందుకు కష్టపడుతుంది. తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి తనిక ఆస్తి రావాలని ఎందుకు ఆశపడుతుందని అంటుంది రేఖ. ఇంత ఆస్తి కోసం ఇన్నేళ్లు ఎదురుచూడటంతో ఎలాంటి తప్పు లేదని అంటుంది భ్రమరాంబ. దానిని చదివించకుండా భయటకు పంపించకుండా ఇన్నేళ్లు బాగానే కంట్రోల్‌లో పెట్టుకున్నావు కానీ, నువ్వు అడగ్గానే సంతకం చేస్తుందా అని అడుగుతుంది. సంతకం చేయాలంటే చదువుకుని ఉండాలి కదా.. వేలిముద్ర వేస్తుందని అంటుంది రేఖ.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/brahmamudi-serial-march-14th-2026-episode-980-here-is-todays-full-story-168025.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo