
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయాలు. ఏ స్టార్ కపుల్స్ ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, మళ్లీ ఎప్పుడు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలే పెద్ద సమస్యలుగా మారి వివాహ బంధం విడిపోవడానికి దారితీస్తాయి. అలాగే టాలీవుడ్‌లో ఒకప్పుడు చర్చకు కారణమైన జంట నటి ఎస్తర్ నోరోన్హా, బిగ్ బాస్ ఫేమ్, సింగర్ నోయల్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. పెళ్లి జరిగిన కేవలం 16 రోజుల్లోనే వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్, తన మాజీ భార్య ఎస్తర్‌తో జరిగిన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటుడు, సింగర్, రాపర్ నోయెల్ సీన్ (Actor Noel Sean). తన గాత్రంతో పాటు చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, విలన్ గా, స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన గేమ్ తో మరింతమందికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో 2019లో నోయెల్ సీన్ ప్రముఖ నటి ఎస్తార్ నోరా (Esther Noronha)ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది.
అయితే పెళ్లి తర్వాత కేవలం ఒక నెల వ్యవధిలోనే విడిపోయారు. అనంతరం 2020 అక్టోబర్ 31న సోషల్ మీడియా ద్వారా నోయెల్ సీన్ మరియు ఎస్తేర్ నోరోన్హా అధికారికంగా తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి పెట్టారు. నోయెల్ సీన్ నటుడిగా, సింగర్‌గా సినిమాలు, మ్యూజిక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు సాగుతుండగా, ఎస్తేర్ నోరోన్హా కూడా సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. పెళ్లి జరిగిన కేవలం 16 రోజులకే వేరుగా ఉండటం ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా కొంత ప్రభావం చూపిందని చెప్పాలి. ఇటీవల ఈ విషయంపై నోయెల్ స్పందిస్తూ.. తమ విడాకులకు సంబంధించిన అసలు కారణాలను వెల్లడించారు.
ఎస్తేర్ ఆరోపణలు.. నోయెల్ స్పందన
విడాకుల తర్వాత ఎస్తేర్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో, తమ విడిపోవడానికి కారణం నోయెల్ ప్రవర్తననే అని పేర్కొన్నారు. పెళ్లికి ముందు ఉన్న వ్యక్తిత్వం, పెళ్లి తర్వాత మారిపోయిందని ఆమె అన్నారు. అంతేకాకుండా ఆయన ప్రవర్తన తన కెరీర్‌కు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చారు. తన స్వతంత్రతకు అడ్డంకిగా మారే పరిస్థితులు ఎదురయ్యాయని, అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యల కారణంగా అప్పట్లో నోయెల్‌పై సోషల్ మీడియాలో కొంత నెగెటివ్ టాక్ కూడా వచ్చింది. ఆయన గురించి పలువురు విమర్శలు చేయగా, ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ నోయెల్ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నోయెల్ ఈ అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె పేరు ప్రస్తావించకుండా మాట్లాడితే బాగుంటుంది. మేము లీగల్‌గా విడాకులు తీసుకున్నాం. ఆమె పేరు బయట చెప్పే హక్కు నాకు లేదు. పెళ్లి విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. అందులో నా తప్పు కూడా ఉంది. అందుకే నేను నన్నే సరిచేసుకుంటున్నాను’ అని చెప్పారు. అలాగే ఆ సమయంలో తన కెరీర్ గ్రాఫ్ కూడా తగ్గిందని, అదే సమయంలో కరోనా పరిస్థితులు కూడా ప్రభావం చూపాయని తెలిపారు. ‘ఆమె చెప్పిన విషయాలపై నేను వాదించాలనుకోవడం లేదు. అవి నిజాలే అనుకుంటే అలాగే ఉండనివ్వండి. వాటిని ఖండించి ఎందుకు మరింత వివాదం సృష్టించాలి?’ అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ… ‘ఎవరైనా నా మీద బురద చల్లితే, నేను ముఖం తుడుచుకుంటే సరిపోతుంది. మళ్లీ అదే బురదను తిరిగి కొట్టాల్సిన అవసరం లేదు. ఆమె నా గురించి చెడు మాట్లాడినా పర్వాలేదు. కానీ నేను ఆమె గురించి ఎప్పుడూ చెడు మాట్లాడను. ఇప్పటికీ ఆమెపై గౌరవం ఉంది. ఈ ఇంటర్వ్యూ వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నేను బాధపడతాను. క్షమించడం చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను’ అని నోయెల్ భావోద్వేగంగా చెప్పారు. అలాగే పెళ్లి విషయంలో తానే తొందరపడ్డానని, తన కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కూడా ఆయన ఒప్పుకున్నారు. ‘నాలాంటి పరిస్థితి నా శత్రువుకైనా రాకూడదు’ అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం నోయెల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/hero/noel-sean-breaks-silence-on-divorce-with-esther-noronha-in-throwback-interview-168097.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
