
Rating: 2.75/5
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్తీబన్, కేఎస్ రవికుమార్, గౌతమీ, శ్రీనాథ్ మాగంటి, చమ్మక్ చంద్ర, నవాబ్ షా, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర, టెంపర్ వంశీ తదితరులు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
బీజీఎం: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్,
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
రిలీజ్ డేట్: 2025-03-19
అనాథ చిన్నయ్య (పవన్ కల్యాణ్)ను హెడ్మాస్టర్ చంద్రశేఖర్ (కేఎస్ రవికుమార్) చేరదీసి ఉస్తాద్ భగత్ సింగ్ పేరుపెట్టి పెంచుతాడు. బాల్యంలో తనను చేరదీసిన చంద్రశేఖర్ మాస్టార్ స్పూర్తితో అన్యాయాన్ని, అక్రమాలను ఎదురిస్తుంటాడు. పాతబస్తీలో ఏసీపీ పనిచేసే భగత్ సింగ్‌కు ఎమ్మెల్యే నల్ల నాగప్ప (పార్తీబన్) కుటుంబంతో విభేదాలు, వైరం ఏర్పడుతుంది. దాంతో భగత్ సింగ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. అప్పటి నుంచి నల్లమల్ల ఫారెస్ట్‌లో గిరిజనలకు అండగా టీచర్‌గా కాలం వెల్లదీస్తుంటాడు. ఆ క్రమంలోనే నల్ల నాగప్ప కొడుకును ఓ విషయంలో బంధిస్తాడు. తన కొడుకును విడిపించుకోవడానికి ఆ ప్రాంతానికి వెకేషన్ కోసం వచ్చిన శ్లోక (రాశీఖన్నా)ను కిడ్నాప్ చేస్తారు.
ఏసీపీ భగత్‌తో నల్ల నాగప్పకు వైరం ఎందుకు ఏర్పడింది? నాగప్ప కొడుకును భగత్ సింగ్ ఎందుకు టార్గెట్ చేశాడు? శ్లోకను కిడ్నాప్ చేస్తే భగత్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భగత్ సింగ్‌తో లీల (శ్రీలీల)కు ఉన్న బంధం ఏమిటి? లీల, భగత్ సింగ్ మధ్య ప్రేమాయణం ఎలా సాగింది? నల్ల నాగప్పను రాజకీయంగా భగత్ సింగ్ ఎలా భ్రష్టుపట్టించాడు? పాతబస్తీలో మతం పేరు ఉగ్రవాదాన్ని కొనసాగించిన వారికి భగత్ ఎలా బుద్ది చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ.
ఉస్తాద్ భగత్ సింగ్ కథ విషయానికి వస్తే.. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించదు. కేవలం పవన్ కల్యాణ్ ఇమేజ్, ఆయన అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో అనే అంశాలను బేరీజు వేసుకొని రాసుకొన్న రెడీమెడ్ స్క్రిప్ట్. పక్కాగా రొటీన్, రెగ్యులర్ సీన్లతో మూస పంథాలో రాసుకొన్న సీన్లే స్క్రీన్ మీద తారస పడుతుంటాయి. అలాంటి రెగ్యులర్ కథ, కథనాలను కేవలం పవన్ కల్యాణ్ తన స్క్రీన్ ప్రజెన్స్, ఆరాతో రెండు, మూడింతలు ఎలివేట్ చేయడం ఫ్యాన్స్‌కు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్‌ను, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు హరీష్ కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నాడనిపిస్తుంది. ఇందులో మైండ్ పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని కథను నడిపించడానికి ఆసక్తి చూపించారనే విషయం స్పష్టమవుతుంది.
ఫస్టాఫ్‌ను రొటీన్ ఫార్మూలాలతో నెట్టుకొచ్చిన హరీష్ శంకర్.. సెకండాఫ్‌లో రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరిస్తూనే ఎమోషనల్, దేశభక్తి, మత సామరస్య అంశాలకు పెద్ద పీట వేశారు. పవన్ కల్యాణ్ ఐడియాలజీకి అనుగుణంగా కథను చెప్పే ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఆలోచింపచేసేలా ఉంటాయి. హీరో డేట్లను సర్దుబాటు చేసే కృషి మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా..పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్‌తో అలరించే ప్రయత్నమే కనిపిస్తుంది. సన్నివేశాలు బలంగా లేకపోయినా హరీష్ శంకర్, ఆయన టీమ్ రాసిన డైలాగ్స్ చాలా చోట్ల భారీగా పేలాయి. అవి మాత్రమే సినిమా కొంత లైవ్‌గా మార్చాయనిపిస్తుంది.
పవన్ కల్యాణ్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన భావాలు, తాను అనుసరించే సిద్దాంతాలు బేస్ చేసుకొని రాసిన క్యారెక్టర్ అవలీలగా పండించారు. స్టెప్పులు, మాస్ లుక్స్, కామెడీ టైమింగ్‌తో చాలా సీన్లలో మెప్పించారు. రాశీ ఖన్నా కేవలం గ్లామర్ పాత్రకే పరిమితమైంది. శ్రీలీల పెర్మార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించారు. సెకండాఫ్‌లో శ్రీలీల, పవన్ కల్యాణ్ మధ్య సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. పార్తీబన్, కేఎస్ రవికుమార్, రాంకీ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఆయనంకా బోస్ సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. పవన్ కల్యాణ్‌ను స్టైలిష్‌గా చూపించిన విధానం ఈ సినిమాకు బ్యూటీ . ఈ సినిమా పూర్తిగా డైలాగ్ డ్రామాగా నడుస్తుంది. పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైత్రీ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ సినిమాను క్లాస్, మాస్ టచ్‌తో రూపొందించి తీరు చూస్తే వారికి సినిమాపై ఉన్న తపన ఏమిటో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే కమర్షియల్ ఇంకా బెటర్ ఫలితాలు సాధించే అవకాశం ఉండేది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్టైన్మెంట్తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అతిగా ఆశపడితే నిరాశ తప్పదు.. అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటలపాటు వినోదాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/ustaad-bhagat-singh-review-and-rating-in-telugu-168253.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
