Band Melam First Review: బ్యాండ్ మేళం మూవీ ఫస్ట్ రివ్యూ | Band Melam Review by Censor Board: CBFC Clears Kona Venkat’s movie with UA Certificate

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, దర్శకుడు కోనా వెంకట్ నిర్మించిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు మ్యాంగో మాస్ మీడియా సమర్పిస్తున్నది. ఈ సినిమాకు సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కోర్ట్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న టీనేజ్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవీ కలిసి ఈ సినిమాలో నటి్తున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానియన్ సంగీతం, శివ ముప్పరాజు ఎడిటింగ్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి, చంద్రబోస్, శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించారు. ఈ సినిమా మార్చి 26 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై సెన్సార్ వెల్లడించిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

బ్యాండ్ మేళం సినిమా కథ విషయానికి వస్తే. గిరి (రోషన్) రాజీ (శ్రీదేవీ) ఓ గ్రామంలో కలిసి పెద్ద పెరుగుతారు. అయితే ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఒకరి ఫ్యామిలీ అంటే మరొకరికి గిట్టని పరిస్థితి. రాజీ చదువులపై శ్రద్ద పెడితే.. గిరి మాత్రం మ్యూజిక్, తన విలేజ్ బ్యాండ్‌తో ఊర్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకొంటాడు. అయితే వేర్వేరు అభిరుచులతో పెరిగిన గిరి, రాజీ మధ్య మళ్లీ ఓ గొడవ చోటు చేసుకొంటుంది. ఆ గొడవ వారిని విడదీసిందా? వారి ప్రేమను మరింత గాఢంగా మార్చిందా? అనేది ఈ సినిమా కథ.

పక్కాగా రూరల్ ఎమోషన్స్, ఫన్, కామెడీతో సాగే బ్యాండ్ మేళం సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాలో పాత్రలను మలిచిన విధానం, కథను చెప్పి తీరు బాగుంది. అయితే కొన్ని సీన్లపై స్వల్పంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని డైలాగ్స్ మార్చుకోమని సూచించారు. ఆ క్రమంలో ఈ చిత్ర యూనిట్ స్పందించి మార్పులు, చేర్పులు చేయడం, కొన్ని వివరణలు ఇవ్వడంతో ఎలాంటి సమస్యలు లేకుండా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి అని తెలిసింది.

గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగే కుటుంబ, టీనేజ్ ప్రేమ కథా చిత్రంపై సెన్సార్ బోర్డు అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూఏ (U/A16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్, సెన్సార్ మార్గదర్శకాల ప్రకారం 16 ఏళ్ల నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ నిబంధనల్లో పేర్కొన్నారు.

కోనా వెంకట్ మార్క్ తరహాలో సాగే ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. ఈ సినిమా నిడివిని సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అంటే సుమారుగా 150 నిమిషాలకు రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ఎలాంటి ల్యాగ్ లేకుండా సన్నివేశాలను క్రిస్పీగా కట్ చేశారు. కథ, కథనాలను సాగదీయకుండా సరైన రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/band-melam-review-by-censor-board-cbfc-clears-kona-venkats-movie-with-ua-certificate-168397.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo