Youth Movie First Review: యూత్ మూవీ ఫస్ట్ రివ్యూ | Youth Movie Review By Censor Board: CBFC clears Tenage love story with UA13+ Certifcate

తమిళంలో బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ యూత్. ఈ చిత్రంలో కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కెన్ అండ్ గ్యాంగ్ అందించడమే కాకుండా నటించారు. ఈ సినిమాను కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నాష్ ఎడిటర్‌గా, రాము థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, వికీ సినిమాటోగ్రాఫర్‌గా, కావ్య శ్రీరామ్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, రామ్ థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్చి 26వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ గురించి, రన్ టైమ్ గురించిన వివరాల్లోకి వెళితే..

యూత్ సినిమా కథ విషయానికి వస్తే.. 15 ఏళ్ల యువకుడు ప్రవీణ్ (కెన్ కరుణాస్) తన స్కూల్ లైఫ్ ముగిసే సమయానికి నిజాయితీతో కూడిన ప్రేమను పొందాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రేమను పొందే క్రమంలో కొన్ని రిలేషన్‌షిప్స్ బ్రేకప్స్‌కు దారి తీస్తాయి. తన జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? ఇంతకు ట్రూ లవ్‌ను పొందడంలో ప్రవీణ్ సక్సెస్ అయ్యాడా? అనేది ఈ సినిమా కథ.

ఫ్యామిలీ డ్రామా, యూత్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమా పక్కాగా యువతను మెప్పించే విధంగా రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిందనే అభిప్రాయం వ్యక్తమైంది. సెన్సార్ రివ్యూ సందర్భంగా కొన్ని డైలాగ్స్, సన్నివేశాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్చాలని సూచించారు. ఆ క్రమంలో చిత్ర యూనిట్ వాటిని సవరించారు. దాంతో సెన్సార్ నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో తెలుగులో రిలీజ్‌కు ఎలాంటి ఆంక్షలు లేకుండా పాస్ అయిపోయింది.

తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు, బంధాలు, టీనేజ్ యువతలో ప్రేమ పట్ల ఉండే ఆలోచనలు బేస్ చేసుకొని రాసిన సన్నివేశాలు క్లీన్‌గా ఉండటంతో ఈ మూవీకి యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 13 ఏళ్ల నిండిన వారు ఈ సినిమాను ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్ జారీ సమయంలో స్పష్టం చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమా ఇప్పటికే తమిళంలో రిలీజై భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా కంటెంట్, రన్ టైమ్‌‌కు కూడా ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందన లభిస్తున్నది. తెలుగు వెర్షన్ రిలీజ్‌కు వచ్చ సరికి ఈ సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు. అంటే మొత్తంగా 142 నిమిషాల రన్‌టైమ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ కథనాల గురించి ఫిల్మీబీట్ వెబ్ సైట్‌ను ఫాలో అవ్వండి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/youth-movie-review-by-censor-board-cbfc-clears-tenage-love-story-with-ua13-certifcate-168433.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo