
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి శ్రీ సత్య (Sri Satya). బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 6 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించిన ఈమె, ప్రస్తుతం బిబి జోడి 2 వంటి టీవీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె ‘బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి, లివింగ్ రిలేషన్ వంటి విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏమన్నారంటే?
ఈ సందర్భంగా శ్రీ సత్య తన కెరీర్ మాత్రమే కాకుండా వ్యక్తిగత అనుభవాలను కూడా ఓపెన్‌గా పంచుకున్నారు. ముఖ్యంగా లవ్, బ్రేకప్, కుటుంబం వంటి విషయాలపై ఆమె చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో యువతలో పెరుగుతున్న లివింగ్ రిలేషన్ ట్రెండ్‌పై కూడా ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ‘పెళ్లి తర్వాత చేయాల్సిన విషయాలన్నీ పెళ్లికి ముందే చేసేస్తే, పెళ్లి తర్వాత ప్రత్యేకత ఏముంటుంది?’ అంటూ ప్రశ్నించారు. తన దృష్టిలో లివింగ్ రిలేషన్ అంటే అదే అని పేర్కొన్న ఆమె, తాను పెళ్లి అనే వ్యవస్థకు ఎంతో గౌరవం ఇస్తానని తెలిపారు. ఒకసారి పెళ్లి చేసుకున్నాక కష్టమో నష్టమో జీవితాంతం అదే వ్యక్తితో ఉండాలని, అదే అసలు బంధం అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇటీవల లివింగ్ రిలేషన్ పేరుతో సంబంధాలు సెట్ కావడం లేదని చెప్పి సులభంగా విడిపోతున్నారని ఆమె విమర్శించారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లలో బాధ్యత తక్కువగా ఉంటుందని, అది సంబంధాల విలువను తగ్గిస్తుందని పేర్కొన్నారు. “మోజు తీరాక విడిపోవడం సులువు అవుతోంది… అదే పెళ్లి అయితే అంత ఈజీ కాదు” అంటూ తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. ఇక ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ఆమె గట్టిగా స్పందించారు. “కేవలం ప్రేమలోనే కాదు, పెళ్లి తర్వాత కూడా కొందరు తమ కోరికలు తీరాక అభిప్రాయాలు కలవడం లేదని విడిపోతున్నారు.
అలా చేయడం సరికాదు. మీరు మోసపోకండి, మరొకరిని మోసం చేయకండి” అంటూ యువతకు సందేశం ఇచ్చారు. నిజంగా ఒక రిలేషన్‌కు విలువ ఇచ్చే వారు జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకుంటారని, ఒకరితో బ్రేకప్ అయిన తర్వాత వెంటనే మరొకరిపై ఫీలింగ్స్ రావడం ఎలా సాధ్యం అవుతుందో అని ప్రశ్నించారు. అలాగే సంబంధాల్లో మహిళల గౌరవం గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘కొంతమంది ఆడవాళ్లపై అనవసరమైన అభ్యంతరాలు పెడుతున్నారు. కానీ కొందరు తమ భాగస్వామికి ఫ్రీడమ్ ఇస్తూ గౌరవంగా చూస్తున్నారు. ఎక్కడ ఆడవారికి గౌరవం ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది’ అని తెలిపారు.
ఇక కుటుంబ బంధాలపై మాట్లాడిన శ్రీ సత్య, ఇటీవల ప్రేమ కోసం కుటుంబాన్ని దూరం చేసుకుంటున్న యువతపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక సమయంలో తన తండ్రితో ఏడాది పాటు మాట్లాడలేదని, అది ప్రేమ కారణంగానే జరిగిందని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. “ఆ సమయంలో నేను మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు నాకు అండగా నిలిచింది నా తండ్రే” అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రేమలో అతిగా స్పందించడం మంచిది కాదని, ప్రతి విషయంలో ఓపిక అవసరమని సూచించారు.
ఇంకా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆమె కీలకంగా మాట్లాడారు. కొందరు తల్లిదండ్రులు తమ వ్యక్తిగత సుఖాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. “ప్రతి పిల్లవాడికి అమ్మా-నాన్న ఇద్దరి ప్రేమ అవసరం. వారు విడిపోతే పిల్లలు ట్రామాలోకి వెళ్లిపోతారు” అంటూ హెచ్చరించారు. పిల్లల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/bigg-boss-fame-sri-satya-shocking-comments-on-live-in-relationships-marriage-go-viral-168471.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
