
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఒక్కో అవకాశం కోసం ఎంతో ఎదురుచూడాల్సి ఉంటుంది. అందులో మహిళ నటుల పరిస్థితి దారుణం..ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కాస్టింగ్ కౌచ్ వంటి ఆరోపణలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీమణులు ఎదుర్కొనే చేదు అనుభవాలు తరుచు తెరపైకి వస్తునే ఉంటాయి. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న షాకింగ్ ఘటనను బయటపెట్టడంతో అందరూ షాక్కు గురయ్యారు.ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెకు ఎదురైన ఆ దారుణ అనుభవం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి పూజిత. తెలుగు, తమిళం భాషలో కలిపి దాదాపు 138కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాజాగా పూజిత.. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, తన కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సంబంధించిన ఓ ఇంటర్వ్వూ వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్య్వూలో పూజిత మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన సమయంలో తాను ఎదుర్కొన్న ఒక ఘటనను గుర్తుచేసుకున్నారు. ఒక ప్రముఖ స్టార్ హీరో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. తన తొడపై చేయి వేసి పదేపదే ఇబ్బంది పెట్టారని, ఎంతసార్లు అడ్డుకున్నా వినలేదని చెప్పారు. ఆ హీరో ప్రస్తుతం లేరని, అందుకే ఆయన పేరు వెల్లడించడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రికి చెప్పినట్లు తెలిపారు.
ఆమె తండ్రి స్పందన కూడా అంతే ఆసక్తికరంగా నిలిచింది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ‘స్నానం చేసి నిద్రపో’అని చెప్పడం కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అయితే మరుసటి రోజు ఉదయం తన తండ్రి కొత్త కారు తీసుకవచ్చి ఇంటి ముందు పెట్టారట. ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా తన తండ్రి తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పూజిత చెప్పారు. అప్పటి నుంచి తన కారులో తాను, తన కుమారుడు తప్ప మరెవరూ ఎక్కనివ్వనని వెల్లడించారు.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా పూజిత స్పష్టంగా మాట్లాడారు. గ్లామర్ రంగం కావడంతో ఈ విషయాలు ఎక్కువగా బయటపడుతున్నాయని, కానీ వాస్తవానికి అన్ని రంగాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని అన్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అసలు పరిస్థితులు తెలియవని, సమస్యలు ఎదురైనప్పుడు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇంకా కొంతమంది అవకాశాల కోసం తామే ముందుకు వెళ్లి లొంగిపోతున్నారని, మరికొందరు మాత్రం ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక ఇండస్ట్రీని వదిలి వెళ్తున్నారని చెప్పారు. అవకాశాల పేరిట కొందరు దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉన్నాయని, అందుకే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను పలు సందర్భాల్లో బాధితులకు సహాయం చేసినట్లు, పోలీసులతో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా ఆమె వివరించారు. పూజిత వ్యాఖ్యలు మరోసారి వైరల్ కావడంతో సినీ పరిశ్రమలో వాస్తవ పరిస్థితులు మరోసారి చర్చనీయంగా మారాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/throwback-interview-actress-poojitha-opens-up-about-harassment-in-film-industry-168501.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
