Peddi: పెద్ది కోసం రామ్ చరణ్ ఇంత కష్టపడ్డాడా? | Ram Charan’s Beast Transformation for Peddi: 8 Months Hard Work Stuns Fans

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వారి డెడికేషన్ వారు చేసే సినిమాలను మరో లెవల్‌కు తీసుకవెళ్తాయి. అలాంటి అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) డెడికేషన్. చరణ్ తన కొత్త సినిమా పెద్ది (Peddi) కోసం తీవ్రంగా కష్టపడ్డారంట. రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అందర్ని ఆశ్చర్యపరుస్తోంద. తాజాగా రామ్ చరణ్ ట్రాన్స్ఫరేషన్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’తో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు బుచ్చి బాబు సనా కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది (Peddi). ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం A. R. రెహమాన్ అందిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నది.

ఈ నేపథ్యంలో చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ గ్లింప్స్ చూసిన వెంటనే ఇది సాధారణ సినిమా కాదని క్లియర్‌గా అర్థమవుతోంది. మొదట వినిపించే డైలాగ్‌నే సినిమాకి ఉన్న ఇంటెన్సిటీని ఎలివేట్ చేస్తోంది. “కుస్తీ అంటే ఆట కాదు… ప్రాణాల మీద పెట్టే యుద్ధం” అన్నట్టుగా వినిపించే వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే బుచ్చిబాబు సోర్టీ లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది.

విజువల్స్ విషయంలో కూడా గ్లింప్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. రామ్ చరణ్ లుక్ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. ఒంటినిండా మట్టి, గట్టిగా పెరిగిన గడ్డం, చేతిలో గద పట్టుకుని ఆయన నడిచే తీరు చూస్తుంటే నిజంగా ఓ కుస్తీ యోధుడిని చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తోంది. ఆ లుక్‌లో ఉన్న రగ్డ్‌నెస్, కళ్లల్లో కనిపించే ఫైర్… ఇవన్నీ కలిపి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఈ మేకోవర్ ఆయన గత సినిమాలైన రంగస్థలం లోని చిట్టిబాబు పాత్రను కూడా మించి ఉందబోతుందని తెలుస్తోంది.

‘పెద్ది’ పెహల్వాన్ (కుస్తీ పోటీదారుడు) పాత్రకు తగిన ఫిజిక్ కోసం రామ్ చరణ్ తీవ్రంగా కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 8 నెలల పాటు తీవ్రంగా శ్రమించారట. బీస్ట్ అండ్ మస్కులర్ లుక్‌ కోసం రోజుకు కనీసం 3 గంటల పాటు కఠినమైన వర్కౌట్స్, హెవీ వెయిట్ ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్‌ పాటించే వారంట. ఇలా కఠిన నియమాలతో చరణ్ బాడీ ట్రాన్స్‌ఫామ్ జరిగిందట. ఈ ట్రైనింగ్ మొత్తం సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ శివోహం పర్యవేక్షణలో జరిగిందని టాక్.

రామ్ చరణ్ డెడికేషన్‌పై ప్రత్యేకంగా డైరెక్టర్ బుచ్చి బాబు స్పందిస్తూ.. ‘ఇంత కఠినంగా తనను తాను మార్చుకోవడం చాలా అరుదు. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 8 నెలల పాటు శిక్షణ పొందారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 5:30కి నిద్ర లేచి, ట్రైనింగ్ ప్రారంభించేవారు. ఆ సమయంలో ఒక కఠిన దినచర్యను పాటించేవారు. ఈ స్థాయి కమిట్‌మెంట్ చూసి ఆశ్చర్యపోయాను’ అని తెలిపారు.

రామ్ చరణ్ కూడా ఈ సినిమా ‘RRR’, ‘రంగస్థలం’ కంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పడం హైప్‌ను మరింత పెంచింది. రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్, కమిట్‌మెంట్ ‘పెద్ది’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ‘పెహల్వాన్ చరణ్’ ను థియేటర్లలో చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/ram-charans-beast-transformation-for-peddi-8-months-hard-work-stuns-fans-168667.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo