jabardasth: జబర్దస్త్ కొమురక్కపై దాడి… అభిమానుల ముసుగులో హత్యాయత్నం | Attack on Jabardasth Comedian Komarakka Shocks Fans

13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కార్యక్రమం. తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రతిభ ఉండి.. దానిని బయటపెట్టే ఫ్లాట్‌ఫాం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి జబర్దస్త్ ఓ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడింది. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది ప్రస్తుతం సినిమాల్లో హీరోలుగా, దర్శకులుగా, నటులుగా రాణిస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో కొమురక్క ఒకరు.

తెలంగాణ రాష్ట్ర మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలకు చెందిన కుమార్ .. జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ వేస్తూ కొమురక్కగా ఫేమస్ అయ్యాడు. తెలంగాణ యాసలో సామెతలు, పంచ్‌లు విసురుతూ కొమురక్క బాగా ఫేమస్ అయ్యింది. ఈటీవీతో పాటు పలు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో పనిచేసి అవార్డులు, రివార్డులు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది కొమురక్క. అయితే కొమురక్కకు ఈ స్థాయి రావడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఒకప్పుడు హోటల్‌లో పనిచేయడంతో పాటు బాత్రూంలు కూడా కడిగానని కుమార్ పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ వచ్చి హోటల్‌లో పనిచేయడంతో పాటు కోఠిలో ఎఫ్ఎమ్ రేడియోలు, బ్యాగులు, గొడుగులు, పర్సులు అమ్మేవాడు కుమార్. ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో పనిచేసిన తర్వాత ఓ కంపెనీలో హమాలీగా పనిచేయడంతో పాటు బాత్రూంలు కడిగేవాడు. ఆ సమయంలో భార్య ప్రోత్సాహంతో సినిమాలలో వేషాల కోసం ప్రయత్నించాడు కుమార్. బంధువులంతా చెడుగా చెప్పినా, నానామాటలు అన్నా పట్టించుకోకుండా నా భార్య నా వైపే నిలబడిందని కుమార్ పలుమార్లు తెలిపాడు. జబర్దస్త్‌లో పశువులు అంటే ప్రాణం అంటూ కొమురక్క చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం జబర్దస్త్‌లో అంతగా కనిపించకపోయినా ఏదో ఒక ఛానెల్‌లో అలరిస్తూనే ఉంది కొమురక్క.

కాగా.. అభిమానుల ముసుగులో కొమురక్కపై కొందరు దాడికి దిగడం కలకలం రేపింది. కొమురక్క స్వగ్రామంలోనే దాడి జరగడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా బూర్గుల శివార్లలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తి.. కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన ఇంట్లో గతంలో బంగారం చోరీ కావడంతో దీనిపై శ్రీనాథ్‌ను కొమురక్క నిలదీసింది. దాంతో నేరం అంగీకరించిన శ్రీనాథ్.. త్వరలోనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉండటం.. ఎంతకు శ్రీనాథ్ తేల్చకపోవడంతో అతనిని కొమురక్క ఈసారి గట్టిగా నిలదీసింది. దీనిపై రగిలిపోయిన శ్రీనాథ్.. తన స్వగ్రామంలోని మిత్రులకు చెప్పాడు.

దాంతో రెండ్రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్‌కు చెందిన 8 మంది మిత్రులు…. ఉడిత్యాలలోని కొమురక్క ఇంటికి వెళ్లి మేమంతా మీ అభిమానులమని, సెల్ఫీ దిగుదామని వచ్చామని నమ్మించారు. వీరిలో చరణ్ అనే వ్యక్తి కొమురక్క దగ్గరికి వెళ్లి శ్రీనాథ్‌ని ఎందుకు తిట్టావని గొడవకు దిగాడు. ఇంతలోనే వంశీకృష్ణ అనే వ్యక్తి రాయితో కొమురక్కపై దాడి చేశాడు. ఇంట్లో గొడవగా ఉండటంతో ఏం జరిగిందో చూద్దామని వచ్చిన కొమురక్క సోదరుడు యాదయ్యపైనా దాడి చేశారు. మరో వ్యక్తి కర్ర తీసుకుని కొమురక్కని కొట్టాడు. ఈ గొడవతో గ్రామస్తులంతా కొమురక్క ఇంటికి చేరుకుని వాళ్లని పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితులంతా బైక్ వదిలేసి పారిపోయారు. ఎప్పటికైనా చంపేస్తామంటూ బెదిరించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కొమురక్కపై దాడి చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. కొమురక్కపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న అభిమానులు షాకయ్యారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/television/attack-on-jabardasth-comedian-komarakka-shocks-fans-168819.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo