
నటీనటులు: శర్వానంద్, డాక్టర్ రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
బ్యానర్: యూవీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫి: జే యువరాజ్
ఎడిటర్: అనిల్ పసాల
ఆర్ట్ డైరెక్టర్: ఏ పన్నీర్ సెల్వమ్
రిలీజ్ డేట్: 2023-04-03
వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్)కు బైక్ రేసింగ్స్ అంటే పిచ్చి, ప్రాణం. ప్రాణం కంటే ఎక్కువగా భావించే తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్)ను గురువు, మెంటర్‌గా భావిస్తుంటాడు. తండ్రి మాటే వేదం. చాంఫియన్‌గా చేయాలని తండ్రి సునీల్ భావిస్తుంటే.. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా బైక్ రేసింగ్‌కు దూరంగా ఉంటాడు. దాంతో విక్కీపై తండ్రి పీకల్లోతు కోపంలో ఉంటాడు. అయితే తండ్రి డ్రీమ్‌ను దృష్టిలో పెట్టుకొని మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వస్తాడు.
వికాస్‌కు బైక్ రేసింగ్ అంటే ఎందుకు ఇష్టం? తండ్రిని గురువుగా భావించే విక్కీ ఎందుకు బైక్ రేసింగ్ క్రీడ నుంచి తప్పుకొన్నాడు? అనన్య (మాళవిక నాయర్)తో ప్రేమ వ్యవహారం, పెళ్లి జీవితం ఎలా సాగింది. కొడుకు ఇషాన్ నారాయణ్ కోసం వికాస్ ఎలాంటి త్యాగానికి సిద్దపడుతాడు? పారిశ్రామిక వేత్త (అతుల్ కులకర్ణి)తో సునీల్‌కు వైరం ఏమిటి? వికాస్ కెరీర్‌ను బిజినెస్ మ్యాన్ ఎందుకు ఖతం చేయాలని అనుకొన్నాడు? తన తండ్రిపై కుట్ర పన్నిన బిజినెస్ మ్యాన్‌పై వికాస్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే బైకర్ సినిమా కథ.
బైకర్ సినిమా విషయానికి వస్తే.. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌తో బైక్ రేసింగ్ క్రీడను ప్రధాన అంశంగా చేసుకొని దర్శకుడు అభిలాష్ రెడ్డి చేసిన అటెంప్ట్ బాగుంది. కానీ కథ, కథనాలు చాలా రొటీన్, రెగ్యులర్‌గా ఉన్నాయి. గతంలో తెలుగు తెరపై వండి వార్చిన కథతో ఇలాంటి సినిమా చేయడం రిస్కే అనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాను టెక్నికల్‌గా తెరకెక్కించేందుకు బాగా కష్టపడ్డారనే విషయం తెర మీద కనిపిస్తుంది. కానీ మంచి కథను నేపథ్యంగా ఎంచుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. పాత చింతకాయ పచ్చడి మాదిరిగా తండ్రి కొడుకుల బాండింగ్, భార్య, కొడుకు రిలేషన్‌షిప్ అంశాలతో తీసిన ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఇలాంటి కథకు ఎమోషన్స్ పండకపోవడం మరో మైనస్‌గా అనిపిస్తుంది. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ.. రేసింగ్ సీన్లను చిత్రీకరించిన విధానం చాలా కొత్తగా, తెలుగు సినిమాకు డిఫరెంట్ అని చెప్పుకోవాలి.
బైకర్ కోసం శర్వానంద్ ప్రాణం పెట్టి ఫిజికల్‌గా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. కానీ పాత్ర పరంగా తన కష్టాన్ని పూర్తిస్థాయిలో చూపించుకోలేకపోయారు. ఎందుకంటే బైకర్‌గా హెల్మెట్, డ్రస్పింగ్ వేయడం వల్ల శర్వానంద్ లుక్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్ బయటకు కనిపించలేకపోయాయి. దాంతో ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం సరిగా ప్రొజెక్ట్ కాలేకపోయింది. ఇక రాజశేఖర్‌కు బుల్లెట్ సునీల్ పాత్ర కమ్ బ్యాక్. యాంగ్రీ మ్యాన్‌గా కొన్ని సన్నివేశాల్లో మ్యాజిక్ చేశారు. స్టైల్, లుక్ పరంగా ఆకట్టుకొన్నాడు. అతుల్ కులకర్ణి విలన్‌గా తెర మీద పేలవంగా కనిపించాడు. దాంతో ఈ సినిమాకు కావాల్సిన ఇంపాక్ట్ పూర్తిగా క్రియేట్ కాలేకపోయింది. మాళవిక నాయర్, బ్రహ్మాజీ పర్వాలేదనిపించారు.
ఇక ఈ సినిమాకు సాంకేతిక అంశాలు పూర్తి స్థాయి బలంగా మారాయి. యాక్షన్ కోరియోగ్రఫి, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ చాలా స్ట్రాంగ్‌గా మారడం వల్ల ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. రేసింగ్ సీన్లు, విజువల్ పరంగా లొకేషన్లు మరింత రిచ్‌గా మార్చాయి. యూవీ క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథ, కథనాలపై నిర్మాతలు పూర్తిగా దృష్టిపెట్టాల్సిందనిపిస్తుంది.
బైకర్ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే.. అమ్మనాన్న తమిళ అమ్మాయి, జెర్సీ తరహా సినిమాగా చూడొచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకొంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు మిస్ అయ్యాయి. ఫస్టాఫ్ చాలా ఫ్లాట్‌గా సాగుతూ కొన్నిసార్లు సహనానికి పరీక్షగా మారుతాయి. సెకండాఫ్‌లో బాగా సాగదీత, అనసవరమైన సీన్లు సినిమాను ల్యాగ్‌గా మార్చాయి. క్లైమాక్స్‌లో రేసింగ్ సీన్లు ఈ సినిమాను కాపాడాయని చెప్పాలి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే క్రిటిక్స్ మెచ్చిన సినిమాగా మిగిలిపోతుంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/biker-movie-review-and-rating-in-telugu-sharwanands-slow-paced-sports-drama-168841.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
