Leader Twitter Review: లీడర్ మూవీ ట్విట్టర్ రివ్యూ | Leader Twitter Review in Telugu: Legend Saravanan’s mass entertainer

శరవణ స్టోర్స్ అధినేత, తమిళనాడులో ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ హీరోగానే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం లీడర్. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షామ్, ఆండ్రియా జెర్మియా, పాయల్ రాజ్‌పుత్, సంతోష్ ప్రతాప్, అమృతా అయ్యర్, వీటీవీ గణేష్, జార్జ్ మార్యన్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వెంకటేష్ ఎస్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, జిబ్రాన్ వైబోధా సంగీతం అందించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

లీడర్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే టెంప్లెట్ సినిమా. ఫస్టాఫ్ డీసెంట్. సెకండాఫ్ విషయంలో శరవణ పాపైపోయాడు. కథలో ట్విస్టులు సెకండాఫ్‌కు భారీగా హెల్ప్ అయ్యాయి. లెజెండ్ శరవణన్‌ కెరీర్‌కు ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. స్క్రీన్ ప్రజెన్స్, లుక్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమా ఎంగేజింగ్ సాగడంతో కథ ఎలివేట్ అయింది. విలన్ పాత్ర, ఇతర కొన్ని అంశాలు మైనస్ అనిపిస్తాయి. ఈ సినిమాకు క్లైమాక్స్ హైలెట్. కుట్టి ట్విస్ట్ బాగా వర్కవుట్ అయింది. ఓవరాల్‌‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. అంచనాలు లేకుండా వెళ్తే బాగా కనెక్ట్ అవుతుంది. పూర్తిగా టైంపాస్ యాక్షన్ మూవీ. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ఫెంటాస్టింగ్‌గా చిత్రీకరించారు అంటూ 3 రేటింగ్ ఇచ్చారు.

#LEADER Second Half Review 🍿

– A Template action entertainer with Decent first half, followed by a passable second half packed with multiple twists..
– Definitely a better outing for Legend #Saravanan..🤝 he has improved in both looks and screen presence..👍
– The flashback… pic.twitter.com/mdUE5uMLVj

— Laxmi Kanth (@iammoviebuff007) April 3, 2026 “>

తన లుక్స్ గురించి కొందరు చేసిన విమర్శలకు లెజెండ్ శరవణన్ లీడర్ సినిమాతో తగిన సమాధానం చెప్పారు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమాకు వెళ్లాను. లెజెండ్ సినిమా కంటే 10 రెట్లు బెటర్ అనే అనుభూతితో బయటకు వచ్చాను. ఈ సినిమా థెరీ, లియో, విశ్వమ్, విక్రమ్, కూలీ తరహా ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. దర్శకుడు సెంథిల్ కుమార్ కథను డీల్ చేసిన విధానం బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. టెక్నికల్‌గా స్టంట్స్, కెమెరా వర్క్ అమేజింగ్‌గా ఉంది. ఓవరాల్‌గా సర్‌ప్రైజ్ వాచ్ అని క్రిటిక్ కామెంట్ చేశాడు.

#LEADER REVIEW: UNEXPECTED 🤯

Many judged #LegendSaravanan by looks… but he answered with content 🔥
Went in with zero expectations…

came out watching something 10x better than The first movie Legend.

This film feels like a mass collage of
(Theri ,Leo ,Viswasam… pic.twitter.com/TCqTobcpzT

— VJ Santhosh (@VJSanthosh02) April 3, 2026 “>

లీడర్ సినిమా డీసెంట్ అండ్ ఎంగేజింగ్ ఎంటర్‌టైనర్. లెజెండ్ సినిమాతో పోల్చుకొంటే ఫెంటాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఈ సినిమాను చూపించిన విధానానికి తలవంచి సలాం కొడుతున్నాను. చాలా నిజాయితీగా సినిమాను డబ్బును వృథా చేయకుండా తెరకెక్కించారు. తప్పుకుండా చూడాల్సిన సినిమా అని నెటిజన్ కామెంట్ చేశాడు.

#LEADER REVIEW: UNEXPECTED 🤯

Many judged #LegendSaravanan by looks… but he answered with content 🔥
Went in with zero expectations…

came out watching something 10x better than The first movie Legend.

This film feels like a mass collage of
(Theri ,Leo ,Viswasam… pic.twitter.com/TCqTobcpzT

— VJ Santhosh (@VJSanthosh02) April 3, 2026 “>

దర్శకుడు ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ ట్రాక్ రికార్డ్ చూస్తే థ్రిల్లర్ సినిమాలను అద్బుతంగా తెరకెక్కిస్తారనే టాక్ ఉంది. హీరోకు ఉన్న పరిమితులను బట్టి బేరిజు వేస్తే ఇది ఫర్‌ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్. 136 నిమిషాలు ఎంగేజింగ్‌గా సినిమా సాగింది అని క్రిటిక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

#Leader interval – surprisingly engaging . Perfect role for @yoursthelegend !

Durai senthil kumar has worked the script very sincerely . Gripping so far ! Awaiting second half !

— Prashanth Rangaswamy (@itisprashanth) April 3, 2026 “>


Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/leader-twitter-review-in-telugu-legend-saravanans-mass-entertainer-168873.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo