Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ఇదేనా? | Allu Arjun-Atlee Film Title Buzz: Legacy, Spark, Wild Fire or Ayaan?

Allu Arjun 22 X Atlee 6: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. #AA22XA6 పేరుతో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక్క అప్‌డేట్ వచ్చినా వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌పై భారీ సస్పెన్స్ నెలకొనడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది.

టైటిల్ లీక్ అంటూ వైరల్
ఇటీవల సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. అందులో ‘లెగసీ’ అనే పదం కనిపించడంతో ఇదే టైటిల్ అని అభిమానులు. అయితే వర్గం మాత్రం ఇది టైటిల్ కాకపో మరో పేరు, వీఎఫ్ఎక్స్ కంపెనీ లేదా ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెక్నికల్ టర్మ్ అయ్యుంటుందని చెబుతోంది. ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇదే సమయంలో ‘స్పార్క్’, ‘వైల్డ్ ఫైర్’, ‘అయాన్’ వంటి టైటిల్స్ కూడా ప్రచారంలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘అయాన్’ అనే పేరు అల్లు అర్జున్ కుమారుడి పేరు కావడంతో ఫ్యాన్స్‌లో ఈ టైటిల్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ టైటిల్ పెడితే ఎమోషనల్ కనెక్షన్ కూడా పెరుగుతుందని అభిమానులు ఉన్నారు.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో లీకులు తప్పవు. కథ, గెటప్, టైటిల్ ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం మేకర్స్ చాలా స్ట్రీట్ గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, టైటిల్‌ను కూడా చాలా కట్టుదిట్టంగా దాచిపెట్టారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ సినిమా టైటిల్ గురించి హీరో,డైరెక్టర్ కి తప్ప మరెవరికీ తెలియదట. పీఆర్ టీంకి కూడా రిలీజ్‌కు నిమిషాల ముందు మాత్రమే సమాచారం ఇవ్వబోతున్నారని. ఇది మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారో చూపిస్తోంది.

గ్లింప్స్ క్యాన్సిల్… కారణం VFX
మొదట అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లాన్‌ను రద్దు చేసినట్లు సమాచారం. కారణం.. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించిన అద్భుతమైన గ్రాఫిక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే సిద్ధం చేసిన గ్లింప్స్‌లో విజువల్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో, హడావుడిగా రిలీజ్ చేసి హైప్ తగ్గించుకోవడం ఇష్టం లేకుండా మేకర్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ సర్‌ప్రైజ్ ఎంచుకోబడింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన్న, అనుష్క శర్మ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే మృణాల్ ఠాకూర్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌లో లేనని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మ్యూజిక్ విషయంలో కూడా ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్ ఈ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణం ఈ భారీ బడ్జెట్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాను టాక్. అట్లీ స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కలవడంతో ఇది పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్ పీక్ చేరుకుంది. ‘లెగసీ’ ? వైల్డ్ ఫైర్ ? ‘స్పార్క్’ ? ‘అయాన్’ ? లేక పూర్తిగా కొత్త టైటిల్ తో షాక్ ఇస్తారా? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రానివ్వకుండా మేనేజ్ చేసిన మేకర్స్… టైటిల్‌తోనే భారీ సెన్సేషన్ క్రియేట్ ప్లాన్ చేసింది. ఫ్యాన్స్ మాత్రం ఆ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా మారింది.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/gossips/allu-arjun-atlee-film-title-buzz-legacy-spark-wild-fire-or-ayaan-169009.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo