
బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, బాహుబలి నటి నోరా ఫతేహి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ పాన్ ఇండియా మూవీ KD: ది డెవిల్లోని ‘సర్కే చునార్ తేరీ’పాట చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం తొలుత ముగిసిపోయిందని భావించినా, రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అసభ్యకర లిరిక్స్, డబుల్ మీనింగ్ పదాలతో రూపొందించిన విమర్శలు వెల్లువెత్తడంతో ఈ పాట సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. చివరకు ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్వయంగా స్పందించి, సుమోటోగా కేసు నమోదు చేయడం వివాదం కీలక మలుపుగా మారింది.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పాట ఉందని అభిప్రాయపడిన కమీషన్, ఇందులో పాల్గొన్న నటినటులు, దర్శకుడు, నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా నోరా ఫతేహి, సీనియర్ నటుడు సంజయ్ దత్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే.. ఏప్రిల్ 6న జరిగిన తొలి విచారణకు నోరా ఫతేహి వ్యక్తిగతంగా హాజరు కాకుండా, తన న్యాయవాది పంపడం మహిళ కమిషన్ (NCW)ఆగ్రహానికి కారణమైంది. నోరా వ్యక్తిగత హాజరు కావాలని కమీషన్ స్పష్టం చేసింది.
ఈ విషయంపై మహిళ కమిషన్ (NCW) చైర్పర్సన్ విజయ రహాత్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోరా ఫతేహికి చివరి అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 27న జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలా నోరా చిక్కుల్లో పడినట్టు అయింది.
సంజయ్ దత్ కు నోటీసులు
ఈ వివాదం కేవలం నోరాతో ముగియలేదు. అదే పాటలో కనిపించిన సంజయ్ దత్‌కు కూడా కమీషన్ సమన్లు పంపింది. ఆయన ఏప్రిల్ 8న జాతీయ మహిళ కమిషన్ (NCW)ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విచారణలో ఆయన హాజరు అవుతారా? లేక నోరా మాదిరిగా గైర్హాజరు అవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు
ఈ వివాదానికి ప్రధాన కారణం పాటలోని సాహిత్యం. పాటలో ఉపయోగించిన పదాలు మహిళలను ఆసక్తిగా చూపించేలా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై మహిళ కమిషన్ చైర్పర్సన్ విజయ రహాత్కర్ మాట్లాడుతూ ‘సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం అసలు అంగీకరించలేం’అని స్పష్టం చేశారు. అలాగే, ‘లిరిక్స్ అర్థం తెలియదని చెప్పడం సరైన కారణం కాదు. కంటెంట్ రూపొందించే ముందు దాని ప్రభావం గురించి ఆలోచించాలి’అని మూవీ మేకర్స్ కు సూచించింది.
మరోవైపు వివాదంలో ఈ పాటకు రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, నిర్మాతల కమీషన్ ముందు హాజరు కావడానికి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈ పాట సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిందని అంగీకరించారు. అదనంగా, పాటను యూట్యూబ్ తొలగించినట్లు తెలిపారు. ఇంకా, రాబోయే మూడు నెలల్లో మహిళా సాధికారత కార్యక్రమాల్లో పాల్గొంటామని కమీషన్‌కు హామీ ఇచ్చారు.
నోరా ఫతేహి వివరణ
గతంలో ఈ వివాదంపై నోరా ఫతేహి మాట్లాడుతూ.. తాను చేసిన పాటకు అసలు అర్థం వేరుగా చెప్పారని, హిందీ వెర్షన్ తన అనుమతి లేకుండా విడుదల చేశారని ఆమె పేర్కొన్నారు. అలాగే, తన ఇమేజ్ను AI టెక్నాలజీ ద్వారా కూడా తాను అంగీకరించలేదని నిరూపించబడింది. ఈ వివాదంలో తాను పూర్తిగా బాధ్యురాలు కాదని, కొన్ని సాంకేతిక, కమ్యూనికేషన్ లోపాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెబుతోంది. అయితే కమీషన్ మాత్రం ఈ వివరణతో పూర్తిగా సంతృప్తి చెందలేదు.
సినిమా విడుదలపై ప్రభావం?
ఇదిలా ఉండగా, ఈ వివాదం KD: The Devil సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ పాట వివాదం కారణంగా సినిమా ప్రమోషన్లు, పబ్లిసిటీపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ ఘటనతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో బాధ్యతపై చర్చ మొదలైంది. ఏప్రిల్ 27న నోరా వ్యక్తిగతంగా హాజరవుతుందా? సంజయ్ దత్ స్పందన ఏంటి? ఈ కేసు ఎటు దిశగా మలుపు తిరుగుతుంది? అనేది హాట్ టాఫిక్ గా మారింది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/nora-fatehi-row-ncw-summons-over-sarke-chunari-song-april-27-deadline-169031.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
