Anasuya: అనసూయను వేధించిన కడప యువకుడి అరెస్ట్! | Anasuya Bharadwaj online harassment Case: Kadapa’s Youth Arrested by Cyberabad Police

సోషల్ మీడియాను వేదిక చేసుకొని సినీ తారలను వేధిస్తున్న ఆకతాయిలపై సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝళిపించారు. కొద్దికాలంగా ఆన్‌టైన్ ప్లాట్‌ఫామ్‌లో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను వేధిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఇక నుంచి సోషల్ మీడియాలో వేధించే ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చారనే సంకేతాలు వెళ్లాయి. ఇటీవల కాలంలో ఆన్ లైన్ వేధింపులు ఎక్కువ కావడంతో సినీ తారలు పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే. అయితే అనసూయ్ వ్యవహారంలో జరిగిన విషయాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా నటి అనసూయ వేధింపులకు గురవుతున్నది. వారి ట్రోలింగ్, వేధింపులు శృతి మించడంతో ఆమె డిసెంబర్ 23వ తేదీ, 2025 తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోలు మార్పింగ్ చేయడం, అసభ్య, అశ్లీల కామెంట్స్ చేస్తూ తనను మానసిక క్షోభకు గురి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తనకు సంబంధించిన అసభ్య వీడియోలను జనరేట్ చేసి పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్టు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనసూయ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించిన సైబరాబాద్ పోలీసులు దాదాపు 73 మందిపై కేసు బుక్ చేశారు. అందులో సోషల్ మీడియా హ్యాండిల్స్, యూటర్లు, మీడియా ప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. వారిపై కేసు నమోదు చేసి 22 పేజిలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద పలు సెక్షన్ల కింద విచారిస్తామన్నారు.

అనసూయ చేసిన ఫిర్యాదులో భాగంగా మార్చి 13వ తేదీన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. స్టార్ యాంకర్, నటిపై అశ్లీల, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన యువకుడిని జనార్ధన్‌గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ఈ యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అనసూయ ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన కామెంట్స్‌తో పోస్టులు పెట్టారని విచారణ సందర్భంగా ధృవీకరించుకొన్నారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/heroine/anasuya-bharadwaj-online-harassment-case-kadapas-youth-arrested-by-cyberabad-police-168033.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo