
నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవీ, సాయికుమార్ తదితరులు
బ్యానర్: కోనా ఫిల్మ్ కార్పోరేషన్
సమర్పణ: కోనా వెంకట్, మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
దర్శకత్వం: సతీష్ జవ్వాజీ
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
మ్యూజిక్: విజయ్ బుల్గానియన్
ఎడిటింగ్: శివ ముప్పరాజు
ఆర్ట్: నార్ని శ్రీనివాస్
సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల
సాహిత్యం: చంద్రబోస్, శ్యామ్ కాసర్ల
రిలీజ్ డేట్: 2026-03-26
యాదగిరి అలియాస్ గిరి (హర్ష్ రోషన్), రాజీ అలియాస్ రాజమ్మ (శ్రీదేవి అప్పాల) బావమరదళ్లు. రాజీ తండ్రి సాయి (సాయికుమార్) పేదరికంలో ఉంటే.. జమీందారీ వంశానికి చెందిన గిరి నాన్న (గోపరాజు విజయ్) ఆదరించి చేరదీస్తాడు. అయితే బావ సాయి మాత్రం గిరి కుటుంబంపై ఎలాంటి కృతజ్ఠత చూపడు. కాల క్రమేణా గిరి కుటుంబ ఆస్తులు తరిగిపోయి సాయి కంటే కింద స్థాయికి చేరుకొంటారు. దాంతో సాయి తన కూతురు రాజీని గిరికి దూరంగా పెట్టాలనుకొంటాడు. అయితే చదువుల్లో తెలివిమంతురాలైన రాజీ పై చదువులకు వెళ్తుంది. మ్యూజిక్‌పై ఇష్టంతో గిరి చదువును అశ్రద్ద చేస్తుంది. అయితే ఈ క్రమంలో గిరితో కాకుండా తన క్లాస్‌మేట్‌కు చేరువ అయిన రాజీ ఓ విషయంలో మోసానికి గురి అవుతుంది.
అయితే జమీందారి వంశానికి చెందిన గిరి కుటుంబం పేదరికంలోకి ఎలా జారుకొన్నది? గిరి తండ్రి తన బావ ఫ్యామిలీని సాయి ఎలా చిన్నచూపు చూశాడు? మ్యూజిక్‌పై ఇష్టం కారణంగా గిరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? రాజీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తాను ప్రేమించిన క్లాస్‌మెట్ మోసం చేయడంతో రాజీకి ఊర్లో ఎలాంటి ఇబ్బంది ఎదురైంది. రాజీ ఓ క్లిష్టమైన సమస్యలో కూరుకుపోయినప్పుడు గిరి ఫ్యామిలీ ఏం చేసింది? చివరకు రాజీ, గిరి మధ్య బావ మరదళ్ల సంబంధానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
బ్యాండ్ మేళం సినిమా పాయింట్ వింటే.. లేదా చూస్తే.. గతంలో వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమా గుర్తుకు వస్తుంది. అయితే నేటితరం అభిరుచికి తగినట్టుగా పాత్రలు, భాషను మార్పులు చేసి ఈ సినిమాను కోన వెంకట్, సతీష్ కొత్తగా అందించే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఎలాంటి కొత్తదనం లేకపోవడం, రొటీన్, రెగ్యులర్ తరహా కథ, కథనాలతో మూస ధోరణి వంటకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కథలో బలం లేకపోవడం, సన్నివేశాల్లో పసలేకపోవడం, కథా సమస్య పేలవంగా ఉండటంతో సినిమా అంతా లాగిపెట్టి కొట్టినట్టు ఉంటుంది. ఫస్టాఫ్ పర్వాలేదనే విధంగా సాగినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఇలాంటి అసంతృప్తి మధ్య క్లైమాక్స్‌లో కొంత ఎమోషనల్ పార్ట్ ఊరట కలిగించేలా ఉంటుంది.
కోర్ట్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొన్న హర్ష్ రోషన్, శ్రీదేవీ ఇద్దరు తమ వంతుగా పూర్తిగా ఎనర్జీతో నటించారు. పాత్రలో డెప్త్ లేకపోయినా తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నారు. వారిద్దరి బలబలాలను దర్శకుడు, నిర్మాతలు అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. హర్ష్ రోషన్ డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ మూమెంట్స్‌లో స్పీడ్, బాడీలో ఎనర్జీ చక్కగా ఉన్నాయి. శ్రీదేవీ చాలా బ్యాలెన్స్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ చేసింది. సాయికుమార్ భారమైన, ఎమోషనల్ పాత్రను పండించాడు. గోపరాజు విజయ్, ఇతరులు ఫర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఎక్కువ మార్కులు కొట్టేసింది విజయ్ బుల్గానిన్ అని చెప్పుకోవాలి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. చుట్టేసుకొంటానే పాట బ్లాక్ బస్టర్ ఫీల్ అందిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన లోపం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాలు గాలికి వదిలేయకుండా ఇంకాస్త బెటర్‌గా కసరత్తు చేసి మంచి పాయింట్‌తో సినిమాను రూపొందించి ఉంటే రోషన్, శ్రీదేవీకి మంచి హిట్ పడేది. ఉయ్యాల జంపాల సినిమా చూస్తే కొంత నిరాశ కలుగుతుంది. చూడకపోతే ఏమైనా కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది. ఈ సినిమా చూడాలా? వద్దా? అనే ప్రేక్షకుడికే వదిలేయాల్సిందే.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/band-melam-review-and-rating-in-telugu-kona-venkats-unimpressive-teenage-love-story-168541.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
