
మూవీ: బూకి ( తమిళంలో పూకి)
నటీనటులు: అజయ్ దిశా, ఆర్కే ధనుషా, పాండ్య రాజన్, శియారా, మంచు లక్ష్మీ, విజయ్ ఆంటోని, సునీల్, తదితరులు
నిర్మాత: విజయ్ ఆంటోని
దర్శకత్వం: గణేష్ చంద్ర
ఎఢిటింగ్, మ్యూజిక్: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫి: గణేష్ చంద్ర
ఆర్ట్: ప్రగతీశ్వరన్ పన్నీర్ సెల్వం
కొరియోగ్రఫి: హరి కరణ్
కథ, స్క్రీన్ ప్లే: పుతియా పరితి
రిలీజ్ డేట్: 2025-02-20
కైలాష్ (అజయ్ దిషాన్), ఆజీ (ఆర్కే ధనుషా) ఇద్దరు ఆరేళ్లపాటు ప్రేమించుకొంటారు. ఓ అర్ధరాత్రి జరిగిన ఓ వాదన వారి రిలేషన్‌షిప్ బీటలు వారేలా చేస్తుంది. ఆ ఆర్గ్యూమెంట్‌తో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఆ తర్వాత ఇద్దరు ఇగోలతో ఫైట్స్‌కు దిగుతారు. ఆ ఒక్క సంఘటన ఇద్దరి మధ్య మానసిక సంఘర్షణకు దారి తీయడమే కాకుండా కథకు బలంగా మారుతుంది. ఈ క్రమంలో కైలాష్ మరో అమ్మాయిని, అజి మరో అబ్బాయికి దగ్గరవుతారు.
టీనేజ్ నుంచి మొదలైన కైలాష్, అజీ ప్రేమ కథ ఎలా సాగింది? అర్ధరాత్రి జరిగిన సంఘటనకు కారణం ఏమిటి?
ఇద్దరి మధ్య బ్రేకప్‌కు దారి తీసిన వాదన ఏంటి? బ్రేకప్ ఆ ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? బ్రేకప్ తర్వాత కైలాష్, అజి మానసిక పరిస్థితి? ఆ బ్రేకప్ ప్రభావం నుంచి తేరుకొని మళ్లీ ప్రేమలో పడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా? మళ్లీ వారి మధ్య ప్రేమ చిగురించిందా? కైలాష్, అజి జీవితంలోకి ఎవరు వచ్చారు? అనేది సినిమా కథ.
దర్శకుడు గణేష్ చంద్ర కథ, కథనాలు పక్కగా టీనేజ్‌ను టార్గెట్ చేస్తూ Gen Z ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్నారు. అయితే లవ్, బ్రేకప్, మరొకరితో ప్రేమలో పడటమనే అంశాలు చాలా రెగ్యులర్, రొటీన్. ఈ ప్రేమ కథలోనైనా ఇవే ఉంటాయి. కానీ రెగ్యులర్ పాయింట్స్‌లో ఎమోషన్స్ ఎంత బలంగా ఉన్నాయి? క్యారెక్టర్లను ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా డిజైన్ చేశారు? రెండు గంటలపాటు ఈ సినిమాను ఆడియెన్స్‌కు ఎలా కనెక్ట్ చేశారనే విషయంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
అయితే ఈ సినిమా కథ పాయింట్ బాగున్నప్పటికీ.. హిట్ సినిమాకు కావాల్సిన మసాలా లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయినట్టు అనిపిస్తాయి. విజయ్ ఆంటోని, మంచు లక్ష్మీ, సునీల్ గెస్ట్ రోల్స్ మెప్పించలేకపోయాయి. కథకు బలంగా మారలేకపోయాయి. సునీల్, మంచు లక్ష్మీ నాసిరకమైన పాత్రలను ఎందుకు ఒప్పుకొన్నారనేది సమాధానం లేని ప్రశ్నగా అనిపిస్తుంది. సునీల్, లక్ష్మీ ఉన్నారనే ఫీలింగే కలిగించలేదు. కథలో బలం లేకపోడం, మూవీ నరేషన్ చాలా స్లోగా ఉండటం ఈ సినిమాకు మైనస్. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సినిమా పాజిటివ్‌గా అనిపిస్తుంది.
బూకి సినిమా కథ, కథనాలు అంతగా ఆకట్టుకోలేని విధంగా ఉన్నప్పటికీ.. అజయ్ దిషాన్, ధనుషా తమ టాలెంట్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ధనుషా స్క్రీన్ ప్రజెన్స్, క్యారెక్టర్‌కు తగినట్టు యాటిట్యుడ్, గ్లామర్‌తో ఆకట్టుకొనేలా చేశారు. అజయ్ దిషాన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మంచి క్యారెక్టర్ పడితే నటించడానికి స్కోప్ ఉన్న నటుడు అనే ఫీలింగ్ కల్పించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఒకే అనిపించారు.
Gen Z సినిమా కావాల్సిన వాతావరణాన్ని, నేటి తరం యువత పోకడలను తెర మీదకు బ్రహ్మండంగా తీసుకొచ్చారు. ప్రగతీశ్వరన్ ఆర్ట్ వర్క్ బాగుంది. గణేష్ చంద్ర సినిమాటోగ్రఫి సినిమాను క్లాసీగా, రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. విజయ్ ఆంటోని ఎడిటింగ్ విషయంలో నిరాశపరిచారు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కొంత ల్యాగ్ ఉంది. నిర్మాతగా ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉంచారు. ముఖ్యంగా కథ, కథనాలపై బాగా వర్క్ చేసి.. ఉంటే టీనేజ్ లవ్ స్టోరీలో ట్రెండింగ్ మూవీ అయి ఉండేది. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. టీనేజ్ లవ్ స్టోరీతో ఉండే సినిమాను చూడాలనుకొంటే.. బూకీపై ఓసారి కన్నేయండి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/bookie-pookie-movie-review-and-rating-in-telugu-vijay-antony-failed-to-deliver-perfect-gen-z-love-167165.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
