
దక్షిణాదిలో ప్రముఖ దర్శకులు, నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన చిత్రం కార్మేని సెల్వం. ఈ సినిమాకు నికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. తమిళంలో యువ నిర్మాత అరుణ్ రంగరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ నటించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్, మ్యూజిక్: MAAS, సినిమాటోగ్రఫి: యువరాజ్ దక్షన్, ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: శంకర్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
కార్మేని సెల్వం సినిమా కథ విషయానికి వస్తే.. ప్రతీ మధ్య, దిగువ తరగతి కుటుంబానికి సొంత ఇంటి కల అనేది ఎమోషనల్. నిజాయితీతో జీవించే ఒక సాధారణ కారు డ్రైవర్ సెల్వం జీవితం కథ చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతుంది. ధనికుడిలా మారాలంటే.. డబ్బు ఉన్న వ్యక్తిలా ఖర్చు కూడా చేయాలనే ఫిలాసఫీతో ఈ సినిమా కథ సాగుతుంది. భార్య, భర్తల అనుబంధం, ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగాడు అనే అంశాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించారు. సగటు మనిషి ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం నేపథ్యంగా హై డ్రామా రూపొందింది అనే విషయాలు సెన్సార్ బోర్డు రివ్యూ సందర్భంగా బయటకు వచ్చాయి.
దర్శకుడు రామ్ చక్రీ కమర్షియల్ హుగులకు, ఆర్బాటాలకు వెళ్లకుండా నిజాయితీతో, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, ఆడియెన్స్ ఎమోషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రమనే అభిప్రాయాన్ని సెన్సార్ ప్రతినిధులు, అధికారులు వెల్లడించినట్టు సమాచారం. మధ్య తరగతి జీవితాలు, వారి జీవితాలపై డబ్బు ప్రభావం అనే కోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుడిని కదిలించేలా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
మిడిల్ క్లాస్ దాంపత్య జీవితాలు, వారి కలలు, మానసిక సంఘర్షణ లాంటి అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, సన్నివేశాల్లో మార్పులు, చేర్పులకు సెన్సార్ నుంచి సలహాలు వచ్చాయి. వాటిని పాజిటివ్‌గా స్వీకరించిన చిత్ర యూనిట్ కొన్ని వివరణలతోను, మరికొన్ని సవరణలతో స్పందించారు. దాంతో ఈ సినిమాకు యూ (U) సర్టిఫికెట్తో క్లీన్ చిట్ ఇచ్చారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ మీనన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. లక్ష్మీ ప్రియ, అభినయ తమ పెర్ఫార్మెన్స్తో ఆలరించారు. ఈ చిత్రంలోని సీన్లు హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. దాంతో ఈ సినిమాలోని ఫీల్, ఎమోషన్స్ ఎలివేట్ చేసే విధంా నిడివిని 2 గంటల 29 నిమిషాలకు ఫిక్స్ చేశాం. అంటే సుమారుగా 149 నిమిషాల రన్టైమ్తో సినిమా సాగుతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/carmeni-selvam-movie-review-by-censor-board-cbfc-clears-tenage-love-story-with-u-certifcate-168743.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
