
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి భారీగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి వస్తున్న కామెంట్స్, రివ్యూలు, ఓపినియన్ వివరాల్లోకి వెళితే..
ధురంధర్ ది రివెంజ్ సినిమాను దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ సినిమా పైసా వసూలు చిత్రం. అడల్డ్ రేటెడ్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులు, మాస్ ఆడియెన్స్ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తథ్యం అంటూ దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
#DhurandharTheRevenge comes across as a paisa vasool, seeti-maar Adult Rated entertainer which will be loved by classes and masses alike. At the box office, film will break records and emerge as the biggest B-L-O-C-K-B-U-S-T-E-R written all over it. Go for it!
⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/aIqYDcwtoM
— Umair Sandhu (@UmairSandu) March 14, 2026 “>
హీరోగా నటించిన రణ్వీర్ సింగ్ పాత్ర బాగుంది. తన డైనమిక్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో కట్టిపడేసాడు. రణ్వీర్ కెరీర్‌కు ఈ సినిమా లైఫ్‌లైన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమాకు తన నటనతో రణ్వీర్ ఆయువుపుట్టుగా మారారు. కథ, కథనాలకు బలం చేకూర్చారు. స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఫైర్ క్రియేట్ చేశాడు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధార్‌ను రణ్వీర్ జీవితంలో మరిచిపోడు. మరిచిపోలేనటు వంటి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ ది రివేజ్ సినిమాలో ఆయన లైఫ్‌టైమ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. ధురంధర్ 2 సినిమా ముందు పుష్ప, బాహుబలి సినిమాలు కూడా దిగదుడుపే. ఈ సినిమా విజయానికి, కలెక్షన్లకు ఆకాశమే హద్దు. ఈ చిత్రం 3000 కోట్లు వసూలు చేస్తుంది అని అని ఉమేర్ సంధూ జోస్యం చెప్పారు.
ధురంధర్ 2 సినిమా ఇప్పుడే చూశాను. రణ్వీర్ సింగ్ పైసా వసూలు చేసే పెర్ఫార్మెన్స్ను డెలివరీ చేశారు. హై ఆక్టేన్ యాక్షణ్ సీన్లు, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ బ్యాక్ గ్రాప్ సీన్లు ఫైర్ పుట్టించాయి. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. మీ మనసులను దోచుకొంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ధురంధర్ సినిమా పవర్ ప్యాక్ట్‌గా ఉంది. చాలా గ్రిప్పింగ్‌గా సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేలా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ హై రేంజ్లో ఉంది. ప్రతీ ఫ్రేమ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్ మేకింగ్‌కు నిర్వచనం చెప్పేలా ఉంది. రణ్వీర్ యాక్టింగ్, యాక్షన్ డ్రామా అద్బుతంగా పండించాడు అని తన రివ్యూలో పేర్కొన్నారు.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/dhurandhar-the-revenge-twitter-review-in-telugu-will-ranveer-singh-and-aditya-dhar-hits-the-bulls-e-168221.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
