
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫంకీ (Funky). మాస్ కా దాస్ విశ్వక్ సేన్, గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సురీష్ సారంగమ్ సినిమాటోగ్రఫి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, నవీన్ నూలీ ఎడిటర్‌గా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సమర్పించిన ఈ చిత్రాన్ని ఇటీవల ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ () ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాను వారు చేసిన రివ్యూ ఏమిటి? ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఫంకీ టైటిల్ వినగానే ఫన్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే నమ్మకాన్ని, ఫీలింగ్‌ను టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అనుదీప్ ఫన్‌తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీని అందించబోతున్నాడనే విషయం స్పష్టమైంది. అయితే ఈ సినిమాను అనుదీప్ తెరకెక్కించిన విధానంలో పూర్తిగా నిజాయితీ ఉంది. స్ట్రీట్ హిట్టింగ్ కామెడీ ఉండబోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ మాత్రం గీత దాటకుండా డైరెక్టర్ ఫెయిర్ ఫన్ క్రియేట్ చేయడంలో తన మార్కు చూపించారనే విషయం స్పష్టమైంది.
ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు కంటే విభిన్నమైన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేయబోతున్నారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాకు గ్లామర్ డోస్‌ను కాయదు లోహర్ అందించారు. పాటల్లో స్టెప్పులు, ఫన్నీ డైలాగ్స్ ఈ మూవీకి స్పెషల్‌గా కనిపించబోతున్నాయనే అభిప్రాయం సెన్సార్ తర్వాత వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో అన్నీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉండటంతో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ సినిమాకు సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ అందించింది. ఈ సినిమాపై సెన్సార్ పరంగా పూర్తిగా సంతృప్తిని అందించారు. అలాగే ఈ చిత్రానికి యూ (UA7+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాని ప్రకారం ఈ సినిమాను ఏడు సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరు చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని తెలియజేశారు.
ఫంకీ సినిమాకు ఫన్ అండ్ ఎమోషన్స్ సాగడం వల్ల పెద్దగా నిడివి పెంచడానికి అవకాశం లేకపోయింది. అందుకే ఈ సినిమా నిడివిని సాగదీయకుండా ఎడిటర్ నవీన్ నూలీ షార్ప్‌గా కట్ చేశారు. దాంతో ఈ సినిమా నిడివి ఈ మధ్యకాలంలో చాలా షార్ట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు. అంటే ఈ చిత్రం రన్ టైమ్ 128 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. దాంతో ఈ సినిమాలో ఫాస్ట్ ట్రాక్‌లో సాగుతుందని సంకేతాలను చిత్ర యూనిట్ అందించింది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/funky-review-by-censor-borad-cbfc-clears-vishwak-sens-movie-with-a7-certificate-166759.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
