Funky Twitter Review: ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ | Funky Twitter Review in Telugu: Is Vishwak Sen gets hit with Anudeep Movie

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫంకీ (Funky). మాస్ కా దాస్ విశ్వక్ సేన్, గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సురీష్ సారంగమ్ సినిమాటోగ్రఫి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, నవీన్ నూలీ ఎడిటర్‌గా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సమర్పించిన ఈ చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్లను ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ల గురించి నెటిజన్స్ అందించిన టాక్ ఏమిటి? క్రిటిక్స్ రివ్యూ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ఫంకీ మూవీ ప్రీమియర్లను భారీగా నార్త్ అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ సినిమా మొదటి ప్రీమియర్ అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది.

ఫంకీ చిత్రం ఫుల్ ఆన్ ఫన్, ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫుల్ ఆన్ ఫంకీగా ఉంటుంది. దర్శకుడు అనుదీప్ ఎప్పడూ నిరాశపరచడు. విశ్వక్ సేన్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయం నూటికి నూరు శాతం గ్యారెంటీ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/funky-twitter-review-in-telugu-is-vishwak-sen-gets-hit-with-anudeep-movie-166821.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo