
తెలుగు సినిమా రంగంలో టాలెంటెడ్ యాక్టర్లు లక్ష్మీ మంచు, అనన్య నాగళ్ల, శ్రద్దా దాస్, హరితేజ, హేమ, సుప్రిత, శ్రీరామచంద్ర, హర్షవర్ధన్ తదితరులు నటించిన చిత్రం లేచింది మహిళా లోకం. బృహస్పతి, ఆపారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ, సన్ స్టూడియో బ్యానర్లపై హేమ రాజశేఖర్, శ్వేతా మహి, నిరోషా నవీన్ నిర్మాతలుగా కార్తీ దాసరి, అర్జున్ గున్నాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి జాగ్జ్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అనిల్ కుమార్ ఎడిటర్‌గా, ఝాన్సీ ఆర్ట్ డైరెక్టర్‌గా, శృతి రంజని మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సమాజంలోని లింగ వివక్ష, స్త్రీ, పురుష సమాన హక్కులు, దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య అవగాహన రాహిత్యం, కోర్టు కేసులు, విడాకులు అంశాలుగా సినిమా రూపొందింది. సమకాలీన పరిస్థితుల్లో భర్తలపై భార్యల దాడులు నేపథ్యంగా ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలతో లీగల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసి క్లీన్ సర్టిఫికెట్ జారీ చేసింది.
లేచింది మహిళా లోకం సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. ఈ సినిమాకు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. వారు సూచించిన కొన్ని సీన్లకు వివరణ ఇచ్చాం. కొన్ని మార్పులు చేశాం. దాంతో వారు సంతృప్తి చెందారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ సినిమాను 13 ఏళ్లు దాటిన వారందరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, కథను చర్చించిన తీరు ఆకట్టుకొనేలా ఉందని సెన్సార్ ప్రతినిధులు, అధికారులు తెలిపారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఆద్యంతం ఫన్, హ్యుమర్ అంశాలతో డైలాగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను తక్కువ నిడివితోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా నిడివి సుమారుగా 1 గంట 51 నిమిషాలు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 111 నిమిషాలుగా ఫిక్స్ చేశారు అని సెన్సార్ సర్టిఫికెట్ వెల్లడించింది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/lechindi-mahila-lokam-review-by-censor-board-cbfc-clears-lakshmi-manchu-film-with-ua13-certificat-168499.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
