Nawab Cafe Movie Review: నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Nawab Cafe Movie Review and Rating in Telugu

నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
బ్యానర్ : హర్షిక ప్రొడక్షన్స్
రచయిత & దర్శకుడు: ప్రమోద్ హర్ష
నిర్మాత : రాధా వి పపుడిప్పు
సహ నిర్మాత: వెంకట్ ఆర్ పాపడిప్పు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
DOP: క్రాంతి వర్ల
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
ఎడిటర్: పవన్ నరవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శశి కె నారాయణ
రిలీజ్ డేట్: 2025-02-20

400 సంవత్సరాల నుంచి నిజాం సంస్థానంలో ఛాయ్ వాలాగా పేరు గడించిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన నవాబ్ కేఫ్‌ను కుటుంబ ప్రతిష్టగా నడుతుపుతుంటాడు. తండ్రి రంగనాథ్ చేసే ఛాయ్ బిజినెస్‌ అంటే రాజా (శివ కందుకూరి)కి అయిష్టత ఉంటుంది. అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలనే మోజులో ఉంటాడు. సఖి (తేజు అశ్విని)ని తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే చార్మినార్ నడిబొడ్డున ఉన్న నవాబ్ కేఫ్‌ను అమ్మేసి కోట్లు గడించాలని అనుకొంటాడు. కానీ తండ్రి మాత్రం వారసత్వ ఆస్తిని అమ్మడానికి నిరాకరిస్తాడు. దాంతో తండ్రితో వాగ్వాదం పెట్టుకొంటాడు. కొడుకు తీరుపై మనస్తాపం చెందిన రంగనాథ్ అర్ధాంతరంగా కన్నుమూస్తాడు.

నవాబ్ కేఫ్‌కు ఉన్న చరిత్ర, ప్రతిష్ట ఏమిటి? రంగనాథ్ ఎందుకోసం అరకొర జీవితాన్ని నవాబ్ కేఫ్‌తో కొనసాగిస్తూనే ఉంటాడు. కొడుకు రాజా తీరుపై రంగనాథ్ రియాక్షన్ ఏమిటి? సఖితో ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? రాజా అమెరికా ప్రయత్నాలు ఎలా సాగాయి? కుమార్ (చైతన్య కృష్ణ)తో రాజా కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటి? తండ్రి మరణం తర్వాత రాజా ఎలాంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు?

హైదరాబాద్ నగర ప్రతిష్టకు చిహ్నంగా మారే ఇరానీ ఛాయ్ కథా నేపథ్యంగా దర్శకుడు ప్రమోద్ హర్షఎంచుకొన్న పాయింట్ బాగుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌కు యూత్‌ఫుల్ లవ్ స్టోరి, కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలనే ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంది. కానీ తండ్రి, కొడుకుల మధ్య ఇంకా బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే ఇంకా బెటర్ అవుట్‌ఫుట్, ఫీల్ పెరిగేది. అయినా కొత్త దర్శకుడైనా కథను, సీనియర్ యాక్టర్లను డీల్ చేసిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రాజీవ్ కనకాల, వడ్లమాని శ్రీనివాస్, శివ, చైతన్య పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎమోషనల్‌గా సాగే ఈ కథలో కామెడీ ఫుల్లుగా వర్కువట్ అయి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి చిత్ర దర్శకుడైనా సినిమాను గ్రిప్పింగ్ చెప్పడానికి ప్రయత్నించాడు.

నటీనటుల విషయానికి వస్తే.. తండ్రి రంగనాథ్‌గా రాజీవ్ కనకాల పాత్రలో ఒదిగిపోయి సినిమాను పూర్తిగా ఎమోషనల్‌గా మార్చారు. క్యారెక్టర్‌లో జీవించడమే కాకుండా మెచ్యుర్డ్ ఫెర్పార్మెన్స్ అందించారు. అలాగే శివ కూడా గత సినిమాల్లో కంటే యాక్టింగ్ పరంగా బాగా చేశాడు. ఇంటర్వెల్ సీన్‌లోను, అలాగే సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో బాగా పెర్ఫార్మ్ చేశాడు. చైతన్య కృష్ణ విలనిజం ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. పవర్‌ఫుల్‌గా కనిపించినప్పటికీ.. పాత్రలో డెప్త్ లేకపోవడంతో పెద్దగా రాణించలేకపోయాడనిపిస్తుంది. తేజు అశ్విని క్యూట్‌గా కనిపించింది. కీలకమైన పాత్రలో శ్రీనివాస్ వడ్లమాని మరోసారి గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

ఈ సినిమాలోని సాంకేతిక విభాగాల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉంది. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. సెంటిమెంట్ సీన్లను తన మ్యూజిక్‌తో మరింత ఎమోషనల్‌గా మార్చారు. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫి కూడా చాలా రిచ్‌గా ఉంది. హైదరాబాద్ అందాలను, ముఖ్యంగా చార్మినార్ ప్రాంతంలో ఏరియల్ షాట్స్‌తో కనువిందు చేశారు. ఈ సినిమా కోసం వాడిన కలర్ టోన్ బాగుంది. నిర్మాత రాధా వీ పపుడిప్పు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను ఇష్టపడే వారికి నవాబ్ కేఫ్ తప్పకుండా నచ్చుతుంది.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/nawab-cafe-movie-review-and-rating-in-telugu-167153.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo