
మూవీ: నిలవే
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
దర్శకత్వం: సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
బ్యానర్: POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-02-13
యాడ్ ఏజెన్సీలో వీడియో కెమెరామెన్‌గా పనిచేసే అర్జున్ (సౌమిత్ రావు) తన స్నేహితుడు (వైవా హర్ష)తో కలిసి రూమ్ షేర్ చేసుకొంటూ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఓ కారణంగా జీవితంపై విరక్తి పుట్టి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆత్మహత్య చేసుకొనే సమయంలో ఎదురుగా ఉండే ఫ్లాట్‌లో కనిపించిన అతిథి (శ్రేయాసి సేన్) అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించి ఆ ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. అతిథితో పరిచయం పెంచుకొని ఆమెకు శారీరకంగా దగ్గరవుతాడు. కానీ ఓ దశలో అర్జున్‌తో లవ్‌ను రిజెక్ట్ చేస్తుంది.
అర్జున్ సూసైడ్ అటెంప్ట్‌కు కారణం ఏమిటి? అతిథికి అర్జున్ ఎలా చేరువయ్యాడు? అతిథి బంధం అర్జున్‌లో ఎలాంటి మార్పు తెచ్చింది? వారిద్దరూ ఎలా శారీరకంగా దగ్గరయ్యారు? అర్జున్ తో ప్రేమ కొలిక్కి చేరే సమయంలో అతిథి ఎందుకు రిజెక్ట్ చేసింది? శంతను ఎవరు? ఇంతకు అతిథి గతం ఏమిటి? అర్జున్‌కు ఎందుకు దూరం కావాలనుకొన్నది? చివరకు అర్జున్, అతిథి రిలేషన్‌షిప్‌కు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే నిలవే సినిమా కథ.
ఒంటరి జీవితం అనే పాయింట్, అలాగే ప్రేమ కోసం తపించే యువకుడి కథగా జంట దర్శకులు సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం ఎంచుకొన్న పాయింట్ బాగుంది. దానిని ఎమోషనల్ ప్రేమకథగా విస్తరించిన విధానం, పాత్రల డిజైన్ సినిమాకు బలంగా మారింది. అర్జున్ సూసైడ్ పాయింట్‌తో కథ ఎమోషనల్‌గా మారి.. సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య సీన్లు, వారి ఇంట్రడక్షన్ సీన్లను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో చిత్రీకరించిన విధానం బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో కొంత కథా వేగం తగ్గడంతో స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కొన్ని రొటీన్ సీన్లు సినిమాలో ఫీల్‌కు అడ్డు తగిలాయనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ పాయింట్‌ను ఇంట్రెస్టింగ్ చెప్పడంతో సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి.
అయితే ఊహించినట్టే దర్శకులు సెకండాఫ్‌ను మరింత భావోద్వేగంతో నడిపించారు. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా మరింత ఎమోషనల్‌గా కనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కూడా స్పీడ్ తగ్గడంతో మళ్లీ కథను సాగదీశారంటీ అనే సందేహం కలుగుతుంది. కానీ ఫీల్ గుడ్ అంశంతో సినిమాను ముగించడం పాజిటివ్‌గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది.. లవ్ స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి సినిమాను చూసిన అనుభూతి కలుగుతుంది.
ఈ సినిమాకు అత్యంత సానుకూలమైన అంశం అంతా యూత్, కొత్తవారు కలిసి చేయడం. ఇండస్ట్రీకి కొత్తవారైనా అనుభవం ఉన్న వారిలా నటించారు. అర్జున్‌గా యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ తన ప్రతిభను నిరూపించుకొన్నాడు. అతిథిగా శ్రేయాసి సేన్ గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో నటించిన మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ప్రయత్నం చేశారు. సాంకేతికంగా ఈ సినిమాకు నిపుణుల సహకారం బాగుంది. కల్యాణ్ నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకు అసెట్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు ప్రొఫెషనల్‌గా ఉన్నాయి.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/nilave-movie-review-and-rating-in-telugu-166851.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
