
మెగా పవర్ స్టార్ రాంచరణ్, గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, విజి చంద్రశేఖర్, రజతవ దత్తా, సత్య తదితరులు నటిస్తున్నారు.
క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎఢిటింగ్: నవీన్ నూలీ, మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ క్రమంలో షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదల ఓ పక్కన ఉంట.. హీరో రాంచరణ్‌కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకోవడం టీమ్‌ను ఆందోళనకు గురి చేసింది. చెర్రీకి జరిగిన ప్రమాదం వివరాల్లోకి వెళితే..
పెద్ది రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాల్లో రాంచరణ్, ఇతరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్ కంటికి స్వల్ప గాయమైంది. అయితే అంతగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
స్వల్ప గాయం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని రాంచరణ్‌కు వైద్యులు సూచించారు. రెండు రోజులపాటు షూటింగ్‌కు దూరంగా ఉండాలని సూించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ యదావిధిగా షూటింగ్లో రాంచరణ్ పాల్గొంటారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, మార్చి 27వ తేదీన రాంచరణ్ పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా గురించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం, షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం కోసం భారీ సెట్ వేసి స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే రాంచరణ్ గాయపడటంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని వార్తకు మరింత బలం చేకూరేలా ఉంది. ఇదంతా అనధికారికంగా జరుగుతున్న చర్చ మాత్రమే. ఈ సినిమా రిలీజ్‌పై నిర్మాత, దర్శకులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా రాంచరణ్ త్వరగా కోలుకొని పెద్ది షూటింగ్‌కు హాజరవ్వాలని మెగా అభిమానుల కోరుకొంటున్నారు.
Photo Courtesy: Instagram
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/hero/ram-charan-injured-in-peddi-action-scenes-shooting-in-hyderabad-168491.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
