
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్జీవీ తన రివ్యూలో ఏం చెప్పారంటే?
గత రాత్రి ధురంధర్ 2 సినింమా చూశాను. ఈ సినిమా చూసినంత సేపు ప్రతీ విషయంలోను అనేక రకాలుగా ప్రభావితం అయ్యాను. బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రభంజనం, ఆడియెన్స్ ఉత్సాహం, సోషల్ మీడియాలో హంగమా, సినిమాటిక్ గ్రామర్‌ను బ్రేక్ చేస్తున్న విధానం పక్కన పెడితే.. సైకలాజికల్‌గా ఆడియో, విజువల్ ఇంప్టాక్ మతిపోయేలా ఉంది అని వర్మ పేర్కొన్నారు. షోలే సినిమా కంటే 100 రెట్లు గొప్పగా ఉంది. భారతీయ సినిమాలో గ్రెటెస్ట్ సినిమాగా చెప్పుకొనే మొఘల్ ఏ ఆజమ్ సినిమాలను కూడా టీవీ సీరియల్స్‌లా మార్చేసింది ఈ సినిమా అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు.
ధురంధర్ సినిమా కొత్త సినిమాటిక్ ఆర్డర్‌కు పుట్టుక లాంటిది. వరల్డ్ సినిమా రంగంలో పాతతరం మూస విధానాన్ని దాయాదక్షిణాలు లేని బ్రేక్ చేసిన పంథా ఉంది. దర్శకుడు పేరు స్పెల్లింగ్ కూడా మొదటి అక్షరంతోనే ఆదిత్య ధార్ పేరు మొదలవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టఫర్ నోలన్ లాంటి వాళ్లు తాము తీసే సినిమా పంథాను మార్చుకొంటారు. అంతటి ప్రభావితం చేసే సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి అంటూ వర్మ కామెంట్ చేశారు.
అయితే ఆర్జీవి చెప్పిన రివ్యూపై నెటిజన్ల రియాక్షన్ మిక్స్‌డ్‌గా ఉంది. షోలే సినిమాను మించి అంటే వినడానికి కొంత అతిశయోక్తిగా ఉంది అని నెటిజన్ కామెంట్ చేశాడు. వర్మ ఈ సినిమాను అంతగా తన భుజాల మీద ఎందుకు మోస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఆయన ప్రయోజనాలు ఏమిటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. షోలే సినిమాలోని క్యారెక్టర్లు, డైలాగ్స్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకొంటారు. అలాంటి పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్నది హైప్ కాదు. మేకర్స్‌కు ఓ వార్నింగ్. ఈ సినిమా అన్ని ఫార్మాలిటీస్‌ను తిరగరాస్తుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
After last nights watch of #Dhurandhar2 in terms of it’s sheer cumulative impact in every which way , whether on it’s expected collections , audience euphoria , social influences , cinematic grammar breaking , and above all the psychological audio visual impact , it will be a…
— Ram Gopal Varma (@RGVzoomin) March 18, 2026 “>
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/dhurandhar-the-revenge-review-by-ram-gopal-varma-aditya-dhar-breaks-cinematic-grammar-168211.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
