Seetha Payanam First Review: సీతా పయనం మూవీ ఫస్ట్ రివ్యూ | Seetha Payanam Review by Censor Board: CBFC Clears Arjun Sarja movie Clean with U Certificate

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న నిరంజన్ నటించిన తాజా ప్రేమ కథా చిత్రం సీతా పయనం. ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా కీలక పాత్రలో అర్జున్ సర్జా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాక్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సిరి హన్మంతు, నర్రా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన లవ్ స్టోరి మూవీకి సాయి మాధవ్ బుర్రా మాటలు, అనూప్ రూబెన్స్ సంగీతం, జీ బాల మురుగన్ సినిమాటోగ్రఫి, అయూబ్ ఖాన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వాలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేశారు. ీ సినిమా గురించి వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఎంటి? ఈ చిత్రం రన్‌టైమ్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

సీతా పయనం సినిమా కథ విషయానికి వస్తే.. చెఫ్‌గా కెరీర్‌ను ఎంచుకొన్న సీత (ఐశ్వర్య అర్జున్) ఓ దారుణమైన యాక్సిడెంట్‌కు గురి అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తనను ప్రమాదం నుంచి కాపాడిన అజ్దాత వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలని బయలు దేరుతుంది. ఆ క్రమంలో అభిషేక్ (నిరంజన్)‌తో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో ఓ వాస్తవం ఆమెకు తెలుస్తుంది. ఆ క్రమంలో ప్రేమను ఎంచుకొన్నదా? లేదా నిజాయితీకి లొంగిపోయిందా? తన జీవిత మార్గాన్ని ఎలా ఎంచుకొన్నది అనేది ఈ సినిమా కథ.

సీతా పయనం సినిమా కథలో తన కూతురిని, ఆమె ప్రేమను కాపాడుకొనే తండ్రి (సత్యరాజ్) పడే మానసిక సంఘర్షణ, అజ్దాత ప్రేమికుడు అభిషేక్ లవ్ మధ్య సీతా పయనం ఎమోషనల్ డ్రైవ్‌గా సాగుతుందనే విషయం ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రంలోని అర్జున్ సర్జా, ధ్రువ్ సర్జా పాత్రలు కేవలం స్పెషల్ అప్పీయరెన్స్‌కు పరిమితం కాకుండా సినిమాను ఎమోషనల్‌గా మార్చి ముందుకు నడిపించే క్యారెక్టర్లుగా ఉంటాయనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత స్పష్టమైంది. ఇలాంటి మంచి కథను చెప్పడానికి చేసిన అర్జున్ అభిరుచిని సెన్సార్ అధికారులు ప్రశంసించారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఈ సమయంలో చెప్పడం చాలా అవసరం. ఇళ్లంటే కేవలం గదులు కాదు.. బంధాలు, అనుబంధాలు అని చెప్పే కథ. ఈ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్ అందించారు. ఈ సినిమాను రివ్యూ చేసిన అనంతరం యూ సర్టిఫికెట్ (U) అందించారు. స్వచ్ఛమైన ప్రేమ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చూపించిన విధానంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అర్జున్ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా అయూబ్ ఖాన్ క్రిస్స్ కట్‌తో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అందించేలా చేశారు. ఈ సినిమాను మొత్తంగా 2 గంటల 32 నిమిషాలు అంటే.. 152 నిమిషాలు ఫిక్స్ చేశారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా ఆడియెన్స్‌కు ఎలాంటి ఫీల్ కలిగిస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ గురించిన విషయాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/seetha-payanam-review-by-censor-board-cbfc-clears-arjun-sarja-movie-clean-with-u-certificate-166811.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo