Swayambhu Teaser Review: స్వయంభూ టీజర్ రివ్యూ | Swayambhu Teaser Review: Nikhil Siddhartha’s 20th Film blends historical drama with intense action

కార్తీకేయ 2తో ఊహించని విధంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్ హీరో నిఖిల్. తాజాగా ఆయన నటించిన చిత్రం స్వయంభూ. ఇది నిఖిల్ కెరీర్‌లో 20వ సినిమా కావడం విశేషం. సంయుక్త మీనన్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వేసవి కానుకగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన స్వయంభూ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది పరిశీలిస్తే..

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ అండ్ శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సుబ్బరాజు, సునీల్, సత్య తదితరులు స్వయంభూలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. విజయ్ కామిశెట్టి సంభాషణలు అందించగా.. కింగ్ సొల్మొన్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిబ్ భాషలలో స్వయంభూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ ప్రోమోను పరిశీలిస్తే… అయ్యప్ప శర్మ ఓ రాజు గెటప్‌లో నడుచుకుంటూ వస్తుండగా ఓ పెద్ద బాక్స్‌లో తామర పువ్వు మధ్యలో నందీశ్వరుడు నిలబడి ఉన్న ఓ మంత్ర దండం లాంటి వస్తువును చూస్తాడు. సాక్షాత్తూ ఆ సదాశివుడే దిగొచ్చి శ్రీరాముడికి ఇచ్చిన శంగూన్‌కు కూడా అరణ్య వాసామా అని బాధపడతాడు. ఇంతలో యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు మారణహోమం జరుగుతుతుండటాన్ని చూపిస్తారు. ఇంత పెద్ద రాజ్యాన్ని చేజిక్కుంచున్నప్పటికీ ఆ శంగూన్ వల్ల ఇంకెంత కాలం వీళ్ల నోళ్లని కత్తులతో మూయించాలనపి కోపంగా అడుగుతాడు అయ్యప్పశర్మ.

కాలం కత్తయి దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా.. అనే డైలాగ్ చెబుతుండగా హీరో నిఖిల్ గుర్రంపై రాయల్‌గా ఎంట్రీ ఇస్తాడు. కత్తితో పోరాటాలు చేస్తాడు. బలం ఏదో ఒకరోజు నశిస్తుంది మిత్రమా.. కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుందని పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణా.. అదే యుద్ధనీతి అని సుబ్బరాజు చెబుతుండగా హీరోయిన్లు సంయుక్త మీనన్ కత్తితో విన్యాసాలు చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. మరో హీరోయిన్ నభా నటేష్ చాలా అందంగా తన చెలికత్తెలతో కనిపించింది.

మొత్తంగా పరిశీలిస్తే.. నిఖిల్ స్వయంభూ ఏదో ఆయుధం లేదా దైవ సంబంధిత వస్తువు కోసం రెండు రాజ్యాల మధ్య పోరాటంగా తెలుస్తోంది. నిఖిల్ ఒక శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్, యుద్ధ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌, సినిమాటోగ్రఫి పరంగా స్వయంభూ చిత్రం టెక్నికల్‌గా ఓ రేంజ్‌లో ఉన్నట్లే కనిపిస్తోంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. అయితే టీజర్‌లో కథను ఏమాత్రం రివీల్ చేయకుండా కేవలం పాత్రల పరిచయం, స్టోరీపై చిన్న హింట్ ఇచ్చిన మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కార్తీకేయ 2 తర్వాత నిఖిల్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో స్వయంభూపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నిఖిల్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/swayambhu-teaser-review-nikhil-siddhartha-s-20th-film-blends-historical-drama-with-intense-action-166751.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo