
నటీనటులు: ప్రియాంక చోప్రా, కార్ల్ అర్బన్, ఇస్మాయల్ క్రజ్ కార్డోవా, సాఫియా ఓక్లే గ్రీన్, తెమ్యూరా మారిసన్, జాక్ మారిసన్ తదితరులు
దర్శకత్వం: ఫ్రాంక్ ఈ ఫ్లవర్
నిర్మాతలు: జో రుస్సో, అంజెలా రుసో, మైఖేల్ డిస్కో, ప్రియాంక చోప్రా
సినిమాటోగ్రఫి: గ్రేగ్ బాల్డీ
మ్యూజిక్: హెన్నీ జాక్‌మన్
ఎడిటింగ్: లిసా లాస్సెక్
బ్యానర్: పర్పల్ పెబెల్ పిక్చర్స్, సినీ స్టార్ పిక్చర్స్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
రన్ టైమ్: 101 నిమిషాలు
రిలీజ్ డేట్: 2026-02-25
బ్లడీ మేరీ అలియాస్ ఎర్సెల్ బాడెన్ (ప్రియాంక చోప్రా) ఈస్టిండియా కంపెనీలో మాజీ ఉద్యోగి. భర్త నౌకను నడిపే కెప్టెన్. తన కొడుకు, యుక్త వయసులో ఉన్న మరదలి సంరక్షణ బాధ్యతలను చూసుకొంటూ.. విధి నిర్వహణలో భాగంగా 56 రోజులపాటు సముద్రంపైకి వెళ్లడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ కేమ్యాన్ బ్రాక్ అనే దీవిలో జీవిస్తుంటుంది. ఆ క్రమంలో బ్లడీ మేరిని వెతుక్కొంటూ వచ్చిన కానర్ (కార్ల్ అర్బన్) అనే సముద్రపు దొంగ ఆమెపై దాడి చేస్తుంటాడు. కానర్ నేతృత్వంలో సముద్ర దొంగలు జరిపే దాడిని ప్రతిఘటిస్తూ ఒంటరిపోరాటం చేస్తుంటుంది.
బ్లడీ మేరి గతంలో ఏం చేసింది? బ్లడీ మేరితో మరదలు ఎందుకు ఉంటున్నది? కానర్‌కు బ్లడీ మేరికి ఉన్న వైరం ఏమిటి? మేరి తనను మోసగించిందని కానర్ ఎందుకు భావించాడు? వాస్తవంగా కానర్‌ను బ్లడీ మేరి మోసం చేసిందా? చివరకు మేరీ భర్త తిరిగి వచ్చాడా? కానర్ వర్గం జరిపే దాడిని ఎలా ఎదురించింది? సముద్రపు దొంగల దాడిలో మేరీ చేసిన పోరాటం ఎలా సాగింది? సముద్రపు దొంగలు మేరి నుంచి ఏం ఆశించారు? చివరకు మేరి నుంచి ఏదైతే ఆశించారో అది కానర్ వర్గం చేజిక్కించుకొన్నదా? మేరి, కానర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరాటంలో విజయం ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానమే ది బ్లఫ్ సినిమా కథ.
సముద్రపు దొంగల దోపిడిలు, ఆధిపత్య పోరాటం బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందించారు. జంగిల్ అడ్వంచరస్ మూవీగా కొత్త కొణంలో ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడిలో కనిపించింది. కానీ ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంకా బెటర్‌గా అవుట్‌పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆ విషయంలో మూవీ టీమ్ విఫలమైందనే కోణం కనిపిస్తుంది. అయితే ఫుల్ రేంజ్‌లో ప్రియాంక చోప్రాను మరోసారి యాక్షన్ స్టార్‌గా చూపించే ప్రయత్నం బాగుంది. ఈ సినిమాలో మరో మైనస్ ఏమిటంటే? ప్రధానంగా యాక్టర్లు తెలియనే వారే ఉండటం కథకు కనెక్ట్ కావడానికి కష్టంగా అనిపిస్తుంది. చైల్డ్ సెంటిమెంట్, మోసాలు, కుట్రలు లాంటి అంశాలు సినిమా కథను డిఫరెంట్‌గా మార్చేలా చేసింది.
సూపర్ ఉమెన్ క్యారెక్టర్లు ప్రియాంక చోప్రా జోనస్‌కు కొత్తేమీ కాదు. ఈ సినిమాలో కూడా స్టార్ట్ టూ ఎండ్ ఆమె యాక్షన్ సీన్లలో ఇరుగదీసింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించింది. తన నటనతో కార్ల్ అర్బన్‌ను తేలిపోయేలా చేసింది. వారణాసి మూవీకి ముందు వార్మప్ మ్యాచ్‌లో ఫైట్స్‌తో అదరగొట్టింది. ఈ సినిమా వల్ల ప్రియాంక చోప్రాకు మైలేజ్ పెద్దగా రాకపోయినా.. యాక్షన్ స్టార్‌గా మరిన్ని మార్కులు సంపాదించుకొనేలా పెర్ఫార్మ్ చేసింది.
టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, లొకేషన్లు, యాక్షన్ కొరియోగ్రఫి హైలెట్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో ఓ దీవిలో జరిగే కథను సినిమాటోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు. యాక్షన్ కొరియోగ్రఫి డిసెంట్‌గా ఉంది. ప్రియాంక కోసం డిజైన్ చేసిన సీన్లు బాగున్నాయి. అయితే కథలో ఎమోషన్స్ లేకపోవడం, సరైన సన్నివేశాలు లేకపోవడం వల్ల సాదాసీదా చిత్రంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదనిపిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రియాంక చోప్రాను కొత్తగా చూడాలనుకొనే వారు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తోపాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. సరైన టైమ్ సెట్ చేసుకొని ఒకేసారి మూవీని చూస్తే.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.
Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/the-bluff-english-movie-review-and-rating-in-telugu-priyanka-chopra-jusitifies-in-super-woman-chara-167625.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.
