Ustaad Bhagat Singh: నాది ప్రేమించే గ్రోతం.. సేవ చేసే నక్షత్రం.. పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Speech at Ustaad Bhagat Singh Pre Release Event

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మార్చి 15న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.

సుమ గారు ఇందాక మాట్లాడుతూ.. నన్ను అప్పట్లో అని అన్నారు. ఆ మధ్యే ఓజీ వచ్చిన సంగతి కూడా మీరు మరిచిపోయారు. నేను రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్లగుద్ధిమరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాకు ఈ మాటలు బాధ కలిగిస్తున్నాయి. సినిమా నాకు చాలా ఇష్టమైనది.. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు తీసుకొచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటా. సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ ఎంత అని కూడా ఎప్పుడూ అడగలేదు. తెలుగు సినిమా, తమిళ సినిమా అని నేనెప్పుడూ చూడలేదు. భారతీయ సినిమా అనుకుంటా. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ దాకా వెళ్లిందని పవన్ అన్నారు.

నాకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ ఫంక్షన్‌కి చిరంజీవి గారిని పిలవాలని హరీశ్ అడిగారు. మీకు హీరో కావాలనుకుంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలనుకుంటే చిరంజీవి గారిని పిలవమని చెప్పాను. చిరంజీవి గారు పక్కనుంటే నేను హీరో అన్న సంగతిని మరిచిపోతా. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేశారు. అన్నయ్య చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. రామ్ చరణ్ కూడా ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు. పెద్ది దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి .. వారికి కూడా నా ధన్యవాదాలు అన్నారు పవన్.

సినిమా మొదలుపెట్టాక ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. సినిమాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసి విజయం సాధించడం చాలా కష్టం. సినిమా పోవాలని ఏ హీరో కూడా కోరుకోడు. అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీశ్ శకంర్‌ని దర్శకులుగా తీసుకొచ్చారు. దర్శకుడిని నమ్మితే నేను చాలా బ్లైండ్‌గా వెళ్లిపోతా. కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది, రాజకీయాల్లోకి వెళ్లి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నా. అయినప్పటికీ నాకున్న పరిధిలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 45 రోజుల్లోనే మేజర్ సినిమాను పూర్తి చేశా. పొద్దున రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు చొప్పున పనిచేశా. నిజంగా ప్లాన్ చేస్తే సినిమాలు చేయొచ్చనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ చాలా బాగా ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఎంతో కష్టపడుతున్నారు అని పవన్ తెలిపారు.

ఆనంద్ సాయి సెట్ డిజైన్ ఏ స్థాయిలో ఉంది అనేది సినిమా చూశాక అర్ధమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ లేకుండా సినిమాకు ఈ స్థాయిలో ఊపు వచ్చేది కాదు.. ఆయన సంగీతం దేశం మొత్తాన్ని ఊపుతూ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ గారి ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌ని నేనే రిలీజ్ చేశాను. దేవి గారు బిజీగా ఉండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతలు థమన్ తన భుజాన వేసుకున్నారు. శ్రీలీలకు ఈ సినిమాలో డ్యాన్స్ చాలా తక్కువే ఉన్నా.. తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. శ్రీలీల గారి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలా ఈ సినిమా ఉంటుంది. రాశీఖన్నా గారు కేవలం నా పక్కన యాక్ట్ చేయాలన్న పెద్ద మనసుతో కథ కూడా వినకుండా నేరుగా సెట్‌కి వచ్చారని రాశీఖన్నా పేర్కొన్నారు.

పార్థిబన్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన మొదటి సినిమాకు ఆయనే డైరెక్ట్ చేసి హీరోగా యాక్ట్ చేశారు. నేను, ఆనంద్ సాయి ఇద్దరం వెళ్లి మద్రాస్ ఉదయం థియేటర్‌లో సినిమా చూశాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది.. పార్ధిబన్ గారు మోటివేషనల్ స్పీకర్ కూడా. గబ్బర్ సింగ్ లాంటి హిట్ అందించాలని మేమంతా కష్టపడ్డాం. మీలో ఒకడు దర్శకుడైతే అతనే హరీశ్ శంకర్. తెలుగు చిత్ర పరిశ్రము ప్రాంతీయ భేదాలు, కులం, మతం ఉండవు. హరీశ్ శంకర్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చారు. నన్ను ఇలా చూడాలని చెప్పి ఊహించుకుని తపనపడేవాడు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో నాకు హర్స్ రైడింగ్ రాదు.. గుజరాత్‌లో గుర్రం తీసుకొచ్చి దాని మీద రావాలని చెప్పారు. మనోడో అడిగాడు కదా అని గుర్రం మీద ఎక్కి.. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లమని చెవిలో చెప్పానని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.

హరీశ్ శంకర్ ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. అనవసరంగా కాంట్రవర్సీల జోలికి వెళ్లొద్దని చెప్పా. ఇచ్చిపడేసే గోత్రం నాది కాదు హరీశ్‌ది. నేను దెబ్బలు తీసుకుంటాను.. మా వాడు తీసుకోడు. చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్. నేను ఇలాగైతే బాగుంటానని హరీశ్ నమ్మి చేయించాడు. గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి విజయం సాధించాలని కోరుకుంటున్నా. కానీ తుది నిర్ణయం ఎప్పుడూ ప్రేక్షకులదే.. మీరు ఏం నిర్ణయిస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా శ్రమించాం. ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పు ఇస్తారో నేను కూడా ఎదురుచూస్తున్నా అని పవన్ అన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమా నా గుండెల్లోనే ఉండిపోయింది.. దాన్ని నా నుంచి వేరు చేయలేరు. మనం ఒక సన్నివేశం చూడగానే జీవితంలో ఒక స్థాయికి ఎదుగుతాం. దక్షిణ భారతదేశంలో సినిమా అనేది చాలా కీలకమైనది.. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతుందో మనం ఊహించలేం. రాజ్‌కుమార్ గారిని వీరప్పన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినప్పుడు.. 100 రోజులకు పైగా సినిమాలు బంద్ చేసినప్పుడు క్రైమ్ పెరిగింది. సినిమాను ప్రేక్షకుల నుంచి తీయలేం. అందరి హీరోల సినిమాలు బాగుండాలనే కోరుకుంటా. నా సినిమాలకు నేను తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను కానీ.. మిగతా హీరోల సినిమాలకు నేను ఎక్కువ రేట్లు ఇచ్చేలా చేశా. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు చించేస్తే నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

సినిమా బాగుంటేనే ప్రేక్షకులు వందసార్లు చూస్తారు. అన్‌లైన్ వార్స్ కరెక్ట్ కాదు. ఏ హీరోతోనూ నాకు విభేదాలు లేవు. నేను ఏడాదికి ఓ సినిమా చేస్తా… అలాంటిది ఇన్ని థియేటర్లు, ఇన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ రావాలంటే 100 సినిమాలు వస్తేనే కానీ థియేటర్లు నడవు. నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకు మీరంతా అండగా నిలబడ్డారు. మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేదు. మీ నుంచి నాకు రెండు గుండెల దూరమంతే. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉండాలి, ఆర్ట్ సినిమాలా ఉండకూడదు, కొంచెం జోష్ రావాలి అనుకుంటా. నా నుంచి ప్రేక్షకులు ఎలా కోరుకుంటారో అవన్ని పొందికగా ఒక మాలగా కూర్చాడు హరీశ్ శంకర్‌ని పవన్ ప్రశంసించారు.

రాజకీయాల్లోకి వెళ్లిపోయాం కాబట్టి సినిమాను వదిలేద్దామని అనుకుంటా. కానీ కొంతమంది నేనంటే పడని వాళ్లు మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లందరికీ వ్యాపారాలు ఉన్నాయి.. కాంట్రాక్ట్‌లు తీసుకుంటారు, నాకు సినిమా ఉంది. కాకపోతే పనులు మొత్తం వదిలేసి నేను సినిమాలు చేయడం లేదు. ప్రతి మనిషికి 8 గంటలే డ్యూటీ.. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను. ఒక మూడు నాలుగు గంటలు కుదిరితే.. నా సమయం తాలూకా వాల్యూని గుర్తించి, సరిగా ప్లాన్ చేస్తే సినిమాలు చేయొచ్చనే ధైర్యం వచ్చింది. నెక్ట్స్ టైం ఎవరైనా నాతో సినిమాలు చేయాలని వస్తే.. హరీశ్ శంకర్ దగ్గరికి, మైత్రీ మూవీస్ దగ్గరికి పంపిస్తా. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం అని హరీశ్ రాశారు.. కానీ నా నిజ జీవితంలో అలా చెప్పలేను. ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం అని పవన్ కళ్యాణ్ ముగించారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/pawan-kalyan-speech-at-ustaad-bhagat-singh-pre-release-event-168125.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo