Ustaad Bhagat Singh First Review: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ రివ్యూ | Ustaad Bhagat Singh Review by Censor Board: CBFC ClearPawan Kalyan Movie with UA1+ Certificate

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) సభ్యులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై సెన్సార్ వెల్లడించిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ సినిమా కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

గిరిజన తెగకు చెందిన భగత్ సింగ్ (పవన్ కల్యాణ్) తన గురువు అందించిన స్పూర్తితో తన జీవితాన్ని విలువలు, నైతికతతో కొనసాగిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్‌గా సమాజంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాలను ఎదుర్కోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా గానీ సమాజంలోని చీడ పురుగులను ఏరి వేయడంలో వెనకడుగు వేయడు. ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఓ వ్యక్తికి సంబంధించిన ధైర్య సాహాసాలు మాత్రమే కాదు. దేశ సమగ్రత, సమైక్యత, ప్రజల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన ధీరుడి స్టోరీనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ.

సామాజిక అంశాలు, రాజకీయ నేతల అక్రమాలు, అన్యాయాలపై ఎలుగెత్తే పోలీస్ ఆఫీసర్ కథకు సంబంధించిన సినిమాను మార్చి 10వ తేదీన సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు, డైలాగ్స్ విషయంలో అక్కడక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సినిమా యూనిట్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమాకు యూఏ (UA 16+) సర్టిఫికెట్ అందించారు. సెన్సార్ అనుమతుల ప్రకారం ఈ చిత్రాన్ని 16 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు తమ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ తమ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ సందర్భంగా మంచి పాయింట్‌తో కథను చెప్పిన విధానం బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌లో పవన్ కల్యాణ్ గ్రేస్, హరీష్ శంకర్ మార్క్ కనిపించింది అంటూ చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు ప్రశంసించినట్టు తెలిసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన నిడివి కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కంటెంట్ డిమాండ్ చేసిన మేరకు సెట్ చేశారు. అనధికారికంగా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అంటే.. 150 నిమిషాలు రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది అని తెలిసింది. ఈ సినిమా గురించిన మరిన్నీ వార్తలు, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/ustaad-bhagat-singh-review-by-censor-board-cbfc-clearpawan-kalyan-movie-with-ua1-certificate-167901.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo