Vijay Devarakonda Rashmika: విజయ్, రష్మిక మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..! | Vijay Deverakonda Rashmika Mandanna Age Gap: Wedding Rumours, Love Story

Vijay Deverakonda Rashmika Age Gap: టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన జంటల్లో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న ఒకటి. వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై ఎంత పాపులర్ అయిందో, తెర బయట వారి బంధం కూడా అంతే ఆసక్తిని రేపుతోంది. తాజాగా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే నెలలో మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కానుందనీ, పలు పెళ్లికి సంబంధించిన పలు వివరాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నెటిజెన్లు ఇప్పుడు మరో అంశంపై ఆసక్తిగా వెతుకుతున్నారు. అదే వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. ఇంతకీ రష్మిక, విజయ్ మధ్య ఏజ్ గ్యాప్ ఏంతంటే.?

ప్రేమ నుంచి పెళ్లి వరకు పుకార్లు
2018లో విడుదలైన గీతా గోవిందం సినిమాలో విజయ్-రష్మిక జంటను ప్రేక్షకుల హృదయాల్లో నిలబెట్టింది. ఆ తరువాత డియర్ కామ్రెడ్ లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాల తరువాత వీరి మధ్య బంధం మరింత బలపడిందన్న వార్తలు వినిపించాయి. పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, విదేశీ ట్రిప్స్, ఈవెంట్స్ ఇలా అన్ని ఆ పుకార్లకు ఊతం ఇచ్చాయి.

అయితే.. తాజాగా ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరుగుతుందని, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ప్రముఖులు హాజరవుతారన్న గెస్ట్ లిస్ట్ కూడా వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై విజయ్ లేదా రష్మిక అధికారికంగా స్పందించలేదు. తమ వ్యక్తిగత విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలన్న దృక్పథమే వీరిద్దరిదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఏజ్ గ్యాప్ ఎంత?
రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. అంటే ఈ జంట మధ్య 7 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వయసు తేడాలు సాధారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెరపై కెమిస్ట్రీ, వ్యక్తిగత అర్థం చేసుకోవడం, కెరీర్ దృక్పథం ఇవే బంధాన్ని నిలబెట్టే అంశాలు. ఏజ్ గ్యాప్ కేవలం సంఖ్య మాత్రమేనని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

కెరీర్ అప్‌డేట్స్
విజయ్ దేవరకొండ ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తదుపరి ఆయన రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటించనున్నారని సమాచారం. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. రష్మిక ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ రెండింట్లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆమె నటిస్తున్న కొత్త ప్రాజెక్టులపై త్వరలో అధికారిక ప్రకటనలు రావచ్చని సమాచారం.

ఇప్పటివరకు నిశ్చితార్థం, పెళ్లి విషయాలపై ఈ జంట ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై మౌనంగా ఉండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/whats-new/vijay-deverakonda-rashmika-mandanna-age-gap-wedding-rumours-love-story-167121.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo